బీజేపీకి ఓటేసి ఆగం కావొద్దు.. ప్రజలే ఆలోచించాలి

బీజేపీకి ఓటేసి ఆగం కావొద్దు.. ప్రజలే ఆలోచించాలి

బీజేపీకి ఓటేసి ఆగం కావొద్దన్నారు మంత్రి హరీశ్ రావు. ఎవరికి ఓటేస్తే మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు.  ప్రతి పేదింటికి దళితబంధు తరహాలో TRS ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు మంత్రి హరీశ్ రావు. బీజేపీ గెలిస్తే ఏం చేస్తారో చెప్పడం లేదన్నారు.  ధరలు పెంచుతున్న బీజేపీకి ఓటేస్తారో... పేదలకు అండగా నిలుస్తున్న TRSకి ఓటేస్తారో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మెత్కులగూడెంలో జరిగిన దూందాం కార్యక్రమంలో హరీశ్ మాట్లాడారు.

ఈటల గెలిస్తే...  ఇద్దరున్న ఎమ్మెల్యేలు ముగ్గురవుతారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రైతు బంధు పెట్టినప్పుడు రైట్ అన్న ఈటల.. ఇప్పుడు రాంగ్ అంటున్నారన్నారు. నంబంబర్ 4 నుంచి దళితబంధు ఇస్తామని స్వయంగా కేసీఆరే చెప్పారన్నారు. దళితబంధుపై బీజేపీ-కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేయడం మానాలన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ జరిగిన ప్రెస్ మీట్ లో తలసాని మాట్లాడారు.

తనని గెలిపిస్తే హుజురాబాద్ కి సీఎం కేసీఆర్ తో మాట్లాడి మెడికల్ తీసుకొస్తానన్నారు TRS అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్. హుజురాబాద్ అభివృద్ది తన గెలుపుతోనే సాధ్యమన్నారు. పేదోడికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. మెత్కులగూడెంలో జరిగిన దూందాం కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడారు.

హుజురాబాద్ లో దళితబంధుని అడ్డుకుంది బీజేపీనే అన్నారు TRS MLA జీవన్ రెడ్డి. కాంగ్రెస్-బీజేపీ రెండు ఒక్కటేనన్నారు. ఎంపీ అర్వింద్ స్టంట్ మాస్టర్.. ఎంపీ రేవంత్ రెడ్డి టెంట్ మాస్టర్ అని విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేయడంలో తాము రేవంత్ తో పోటీ పడలేమన్నారు. పసుపు బోర్డు తేవడంలో అర్వింద్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు.