అత్యధిక మెజారిటీతో కేసీఆర్ కు గిఫ్ట్ : హరీష్

రాష్ట్రంలో రోల్ మోడల్ గా ఉన్న గజ్వెల్ ఈ ఎన్నికల్లోనూ అత్యధిక మెజార్టీతో నంబర్ 1గా ఉండాలన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ గజ్వెల్ నుండి ఎమ్మెల్యేగా గెలవడం వల్ల నియోజకవర్గంలో భూముల ధరలు పెరిగాయన్నారు. గతంలో ఎన్నడూ లేనంతంగా నియోజకవర్గo అభివృద్ధి జరిగిందన్న హరీష్..నియోజకవర్గంలో 1.50 ఎకరాల భూమి ఉంది.. అలాగే నియోజకవర్గం నుండి 1.50 లక్షల మెజారిటిని సీఎం కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలన్నారు.  గ్రామ సర్పంచి ఎన్నికల్లో ఎలాగైతే మెజారిటి వచ్చిందో, అలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ అత్యధిక మెజారిటీ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజరిటీని ఇచ్చి దేశంలోనే, పార్లమెంట్ లో నంబర్ 1 గా ఉంచాలన్నారు.

Latest Updates