ఎన్టీఆర్ చిన్న కొడుకుపై కన్నేసిన డైరెక్టర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. తాతగు తగ్గ మనవడు అని ఎప్పుడో మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు అందరి చూపు ఎన్టీఆర్ చిన్న కొడుకు మీద పడింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఈ బొడ్డోడు అదరగొట్టేలా కనిపిస్తాండంటున్నారు. ఇదే విషయంపై డైరెక్టర్ హరీశ్ శంకర్ ట్వీట్ చేయడంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

హోలీ సందర్భంగా..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్టు చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ.. భార్య ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి దిగిన ఫొటోను ఫేస్ బుక్ లో ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. అయితే డైరెక్టర్ హరీశ్ శంకర్..NTR చిన్న కొడుకు గురించి కామెంట్ చేశాడు. లిటిల్ టైగర్ ఆన్ ది వే. చిన్నోడు కెమెరా వైపు చూస్తున్న విధానాన్ని బట్టి.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు. అని హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. దీంతో అతడి ట్వీట్ కు రీ ట్వీట్స్ వదులుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. బుడ్డోడిపై డైరెక్టర్ కన్ను పడిందా అంటూ ఛలోక్తులు వేస్తున్నారు.

See Also: రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై ముగిసిన విచారణ

Latest Updates