నాలుగు బులెట్ల లెక్క జెప్పిండు… ‘వాల్మీకి’ టీజర్ రిలీజ్

నాసినిమాలో నా విలనే నా హీరో…. అంటూ  ‘వాల్మీకి’ సినిమా టీజర్ రిలీజ్ అయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరున్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. స్వాతంత్ర్యదినోత్సవం, రాఖీ పౌర్ణిమ సంధర్భంగా చిత్ర యునిట్ వాల్మీకి టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో మాస్ లుక్ లో వరున్ అలరించాడు.

అందుకే పెద్దోళ్లు చెప్పిండ్రు .. నాలుగు బులెట్లు సంపాయిస్తే రెండు కాల్సుకోవాలే.. రెండు దాసుకోవాలే అని వరున్ చెప్పిన డైలాగ్ టీజర్ లో హైలెట్ గా నిలిచింది. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంటలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మిక్కీ జే మేయర్‌ మ్యాజిక్ అందించాడు. ‘వాల్మీకి’ని సెప్టెంబర్ 13న రిలీజ్ చేయనుంది సినీయునిట్.

Latest Updates