చీకటి తెలంగాణే కాంగ్రెస్ విధానమా.. హరీష్ రావు ప్రశ్న

సంగారెడ్డి : మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకే.. మిర్యాలగూడలో యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యాదాద్రి విద్యుత్ కేంద్రం మూసేస్తాం అని కోమటి రెడ్డి ప్రకటించారు…. దీనిపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారాయన. కోమటి రెడ్డి ప్రకటన వ్యక్తిగతమా.. పార్టీ విధానమా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చెయ్యాలన్నారు. కాంగ్రెస్ హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇవ్వడంతో.. కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు 24గంటల విద్యుత్ సరఫరా చేస్తోందన్నారు. పరాయి పాలన, చీకటి తెలంగాణే కాంగ్రెస్ విధానమా స్పష్టం చెయ్యాలన్నారు.

మంత్రి హరీష్ రావు సమక్షంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని కొన్ని పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ మీటింగ్ కు హాజరయ్యారు. సంగారెడ్డి అసమ్మతి నేత సత్యనారాయణ, ఇతర ముఖ్య కార్యకర్తలతో సమావేశమై బుజ్జగించారు మంత్రి హరీష్ రావు. అందరం కలిసి పని చేసి తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని ఓడించాలన్నారు. ఈ ఎన్నికలు అభివృద్ధికి.. అవకాశ వాద రాజకీయాలకు మధ్య జరుతున్నాయన్నారు. నారాయణ్ ఖేడ్ అసమ్మతి నాయకుడు ఎమ్మెల్సీ రాములు నాయక్ తెరాస అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామన్నారని చెప్పారు.

 

Posted in Uncategorized

Latest Updates