మున్సిపల్ చైర్​పర్సన్​ వార్డులో చెట్ల నరికివేత..

జగిత్యాల, వెలుగు: జగిత్యాలలోని మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి వార్డులో నాలుగేండ్ల కిందట నాటిన హరితహారం చెట్లను కొట్టేశారు. కృష్ణానగర్, అంగడి బజార్లలో  సుమారు 20 వరకు చెట్లను కావాలనే కొట్టేశారని వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీను ఆరోపించారు. దీనిపై చైర్ పర్సన్ శ్రావణిని  వివరణ కోరగా ఓ వృద్ధుడికి ఆరోగ్యం బాగాలేదని, దీంతో చెట్టు స్మెల్​ పడడం లేదని ఒకే చెట్టు కొట్టేశారని తెలిపారు. హరితహారం మొక్కలను మేకలు మేసినా, ఎండిపోయినా ఫైన్ వేస్తున్నారని​, కానీ ఇలాంటి సందర్భాల్లో ఏమీ చేస్తారో చూడాల్సిందేనని  శ్రీనివాస్​ అన్నారు.

 

 

 

Latest Updates