హర్మన్ ప్రీత్ కౌర్@100..తొలి ఇండియన్ క్రికెటర్

టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరో రికార్డ్ సృష్టించారు. 100 టీ20 మ్యాచ్ లు ఆడిన తొలి భారత క్రికెటర్ గా రికార్డ్ సృష్టించారు. హర్మన్ ప్రీత్ తర్వాతి స్థానంలో 98  మ్యాచ్ లతో  ధోని, రోహిత్ ఉన్నారు. సూరత్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో హర్మన్‌ ప్రీత్‌ ఈ ఘనత సాధించారు. జూన్ 2009 లో టౌంటన్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ ఇంగ్లండ్‌పై తొలి టీ20 ఆడారు. ఆల్ రౌండర్ గా 27 వికెట్లు పడగొట్టారు. అలాగే  టీ20 లలో ఇప్పటివరకు 28.61 సగటుతో 2,003 పరుగులు చేశారు. టీం ప్రధాన కోచ్ డబ్ల్యువి రామన్ హర్మన్ ప్రీత్ కు  ప్రత్యేక టోపీని అందజేశారు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.