రాచరికానికి గుడ్ బై చెప్పిన హ్యారీ, మెగన్​

  • ఆర్చీని చూడలేనేమోనని క్వీన్​ ఆవేదన
  • అధికారిక ప్రకటన విడుదల చేసిన క్వీన్​ ఎలిజబెత్​2
  • ఇంటికి అయిన ఖర్చు కూడా తిరిగి కట్టేయనున్న హ్యారీ
  • దాంతో పాటు ఆ ఇంటికి రెంట్​ కూడా చెల్లింపు

ప్రిన్స్​ హ్యారీ, ప్రిన్సెస్​ మెగన్​ మార్కెల్​లు పూర్తిగా రాయల్​ ఫ్యామిలీ నుంచి బయటకొచ్చేశారు. రాయల్​ ఫ్యామిలీలో అన్ని పదవులనూ వదిలేసుకున్నారు. ఎలాంటి ‘టైటిల్స్​’ లేకుండా సామాన్యుల్లా బతకనున్నారు. శనివారం ఈ మేరకు బకింగ్​హాం ప్యాలేస్​ నుంచి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. క్వీన్​ ఎలిజబెత్​2 ఫ్యామిలీలో జరిగిన చర్చల వివరాలను ప్రకటనలో వెల్లడించారు.

టైటిల్స్​ వదులుకుంటరు.. డబ్బులు కట్టేస్తరు

రాయల్​ ఫ్యామిలీలో పుట్టిన వాళ్లకు హెచ్​ఆర్​హెచ్​ (హిస్​/హర్​ రాయల్​ హైనెస్​) టైటిల్స్​ ఉంటాయి. అంటే, మిలటరీ పదవుల దగ్గర్నుంచి, ప్రజలు కట్టే రాయల్​ ట్యాక్స్​ వరకు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ పదవులన్నింటికీ హ్యారీ దూరమవుతారు. అంతేగాకుండా వేరు కాపురం పెట్టాక ప్రత్యేకంగా కట్టించుకున్న ఫ్రాగ్​మోర్​ కాటేజీకి ఖర్చయిన మొత్తాన్నీ తిరిగి చెల్లించేందుకు ఓకే చెప్పారు. దాని కోసం ఖర్చు చేసిన రూ.22.19 కోట్ల (24 లక్షల బ్రిటన్​ పౌండ్లు)తో పాటు, వాళ్లు ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులకు కమర్షియల్​ రెంట్​ (కిరాయి) సుమారు రూ.3.32 కోట్లు (3.6 లక్షల పౌండ్లు ఏడాదికి) చెల్లించేందుకు హ్యారీ, మెగన్​లు సిద్ధమయ్యారు. రాయల్​ ఫ్యామిలీ నుంచి బయటికొచ్చినా ఎక్కడా క్వీన్​ గౌరవానికి భంగం కలగకుండా మెసులుకుంటామని వాళ్లిద్దరు హామీ ఇచ్చారు. ‘‘డ్యూక్​, డచెస్​ ఆఫ్​ ససెక్స్​లు రాయల్​ ఫ్యామిలీకి, క్వీన్​కు ఎప్పుడూ కృతజ్ఞత భావంతోనే ఉంటారు. చేసుకున్న ఒప్పందం ప్రకారం మిలటరీ పదవులు సహా అన్ని రాయల్​ డ్యూటీల నుంచి వాళ్లు తప్పుకోవాలి. వాళ్లకు ఇకపై ప్రజల నుంచి వచ్చే ఏ నిధులూ, రాయల్​ పన్నులూ అందవు. వాళ్లతో ఇకపై క్వీన్​కు సంబంధం లేదు. ఆమె గౌరవానికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటామని హ్యారీ, మెగన్​ హామీ ఇచ్చారు. ఇకపై ఎలాంటి హెచ్​ఆర్​హెచ్​ టైటిట్స్​ వాళ్లకు వర్తించబోవు’’ అని ప్రకటనలో రాణి స్పష్టం చేశారు. అయితే, వాళ్లకు ఇచ్చే సెక్యూరిటీపై మాత్రం ఇప్పుడే మాట్లాడదలచుకోలేదని తెలిపారు. వాళ్లకు సెక్యూరిటీ ఇవ్వాలా వద్దా అని తేల్చేందుకు ఓ ప్రాసెస్​ ఉందని వివరించారు. మిలటరీ  వాళ్లకు హ్యారీ తండ్రి ప్రిన్స్​ చార్లీ, కొద్ది రోజుల పాటు ‘ప్రైవేట్​’గా ఆర్థిక సాయం చేయనున్నారు. అయితే, వాళ్లిద్దరూ బయటకు వెళ్లిపోతున్నారు కాబట్టి, వాళ్ల వాటాగా కొన్ని బిలియన్​ పౌండ్లు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం హ్యారీ, మెగన్​లు నార్త్​ అమెరికా టూర్​లో ఉన్నారు.

మెగన్​ తొందరగా కలిసిపోయింది

స్వతంత్రంగా బతికేందుకు నిర్ణయించుకున్న హ్యారీ, మెగన్​లకు ఎప్పుడూ రాయల్​ ఫ్యామిలీ నుంచి సహకారం ఉంటుందని క్వీన్​ ప్రకటనలో తెలిపారు. అంతేగాకుండా మెగన్​పై ప్రశంసలు కురిపించారు. ఆమె తొందరగా ఫ్యామిలీలో కలిసిపోయారని మెచ్చుకున్నారు. ‘‘కొద్ది నెలలుగా సాగుతున్న చర్చలు, ఇటీవలి మాటామంతితో నా మనవడు, అతడి కుటుంబానికి నిర్మాణాత్మక సాయం చేసేందుకు నిర్ణయించాం. హ్యారీ, మెగన్​, ఆర్చీ ఎప్పుడూ మా కుటుంబానికి ఆప్తులే అవుతారు. రెండేళ్లుగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో హ్యారీ కుటుంబం స్వతంత్రంగా బతికేందుకు ఒప్పుకుంటున్నాం. మెగన్​ మా ఫ్యామిలీలో తొందరగా కలిసిపోయిన తీరు అభినందనీయం’’ అని పేర్కొన్నారు.

మునిమనవడ్ని చూసింది చాలా తక్కువ

తన మునిమనవడు ఆర్చీని చాలా తక్కువ సార్లు చూశానని క్వీన్​ ఎలిజబెత్​2 చాలా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆర్చీ పుట్టిన రెండు రోజులకు మనవడిని చూసిన ఆమె, ఆ తర్వాత ఆర్చీని చూసిందే లేదని రాజకుటుంబం వర్గాలు చెబుతున్నాయి. ఆర్చీకి రెండు నెలల  వయసులో బాప్టిజం ఇప్పించే వేడుకకు ఆమె హాజరు కాలేకపోయారు. ఏటా శాండ్రింగ్​హాంలో జరిగే ప్రైవేట్​ వీకెండ్​ ప్రోగ్రామ్​ ఉన్నందున ఆ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. అయితే, ఇప్పుడు హ్యారీ ఫ్యామిలీ పూర్తిగా రాయల్​ కుటుంబం నుంచి వెళ్లిపోతుండడంతో ఇకపై ఆర్చీని చూడలేనేమోనని క్వీన్​ బాధపడుతున్నారని చెబుతున్నారు. తన అన్నలు, అక్కలతో కలిసి పెరగడని ఆవేదన చెందుతున్నారని అంటున్నారు. ఆమెతో పాటు ఆర్చీ తాత చార్లెస్​ కూడా తీవ్రమైన మనోవేదనలో ఉన్నట్టు చెబుతున్నారు. ప్రిన్స్​ జార్జ్​, ప్రిన్సెస్​ చార్లెట్​, ప్రిన్స్​ లూయీలకు ఆర్చీ దూరమవుతాడేమోనని ఆందోళన చెందుతున్నట్టు ప్యాలేస్​ వర్గాలు చెబుతున్నాయి. తాను కూడా ఆర్చీని చూసి చాలా రోజులైందని ఆయన అన్నట్టు సమాచారం.

see more news సిటీలు,టౌన్ల అభివృద్ధికి రూ.65,845 కోట్లు కావాలి

 

 

Latest Updates