హార్దిక్ పటేల్ కు గుజరాత్ హైకోర్టు షాక్: ఎన్నికలకు దూరం

పటీదార్ ఉద్యమ నాయకుడు, కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ కు గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓ దాడి కేసులో తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలన్న హార్దిక్ వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో అతడు ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు… అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. 2015లో ఎమ్మెల్యే రిషికేష్ పటేల్ ఆఫీస్‌పై దాడి చేసిన కేసులో హార్దిక్ పటేల్‌కు విసానగర్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. దీనిపై స్టే విధించాలని హార్దిక్ కోరగా.. దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. హార్దిక్‌పై 24 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, అందులో రెండు దేశ ద్రోహ కేసులు కూడా ఉన్నాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. బెయిల్‌పై ఉన్నా కూడా హార్దిక్ ఏదో ఒక నేరానికి పాల్పడుతున్నాడని కోర్టుకు తెలిపింది. మార్చి 8న శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ హార్దిక్ హైకోర్టును ఆశ్రయించారు.

Latest Updates