ఆడోళ్లకు జాబ్​లు దొరకట్లె..!

అవకాశమిస్తే జీడీపీ 27 శాతం పెరుగుతదన్న హార్వర్డ్‌‌ స్టడీ

మగవాళ్లతో సమానంగా ఆడోళ్లు చదువుకుంటున్నా ఉద్యోగాల్లో మాత్రం చిన్నచూపే చూస్తున్నారట.  మగవారితో పోలిస్తే ఆడోళ్ల నిరుద్యోగ రేటు రెట్టింపు ఉందట. అమెరికాలోని హార్వర్డ్​ యూనివర్సిటీకి చెందిన రేచెల్​ లీవెన్సన్​, లైలా ఓకేన్​ అనే ఇద్దరు స్టూడెంట్లు దేశంలో మహిళా నిరుద్యోగంపై స్టడీ చేశారు. అందుకు షార్ట్​లిస్ట్​ అనే ఇండియా కంపెనీ సహకారం తీసుకున్నారు. 2,11,004 మందికి చెందిన 2,86,991 జాబ్​ అప్లికేషన్లను పరిశీలించారు. 200 జాబ్​లపై స్టడీ చేశారు. పెద్ద చదువులు చదివి పట్టణాల్లో ఉంటున్న మహిళల్లో 8.7 శాతం మందికి ఉద్యోగాలు లేవని చెప్పారు. కేవలం 4 శాతం మంది మగాళ్లే ఉద్యోగాల్లేకుండా ఖాళీగా ఉన్నారని అన్నారు.

‘‘మగవాళ్లతో పోలిస్తే మహిళలు ఉద్యోగాలు సంపాదించుకోవడంలో అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్నేషనల్​ లేబర్​ ఆర్గనైజేషన్​ ప్రకారం లింగ వివక్ష, ఉద్యోగాలు వెతుక్కోవడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటి వల్ల ఆడవాళ్లు ఉద్యోగాలకు దూరమవుతున్నారు” అని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం లింగ వివక్ష నేరమైనా సరే, మహిళలపై వివక్ష కనిపిస్తూనే ఉందని స్టడీలో స్టూడెంట్లు తేల్చారు. మహిళలకు ఉద్యోగాలొస్తే దేశ జీడీపీ కూడా 27 శాతం పెరుగుతుందని స్టడీలో తేల్చారు. వారికి సమాన అవకాశాలివ్వాలని స్టడీలో సూచించారు.

మరిన్ని వెలుగు న్యూస్ కోసం క్లిక్ చేయండి

Latest Updates