అత్యాచారం కేసులో హాలీవుడ్ నిర్మాతకు 23 ఏళ్ల జైలు

న్యూయార్క్: ప్రపంచమంతా మీటూ ఉద్యమానికి కారణమైన హార్వీ వెయిన్ స్టీన్ కేసులో తీర్పువచ్చింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటు న్నహాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయిన వెయిన్ స్టీన్ కు న్యూయార్క్​ కోర్టు 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది.ఫస్ట్ డిగ్రీ అత్యాచారం కేసులో 20 ఏళ్లు, థర్డ్​ డిగ్రీరేప్ కేసులో మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ జడ్జి జేమ్స్ బర్కి తీర్పు చెప్పారు. బుధవారం తీర్పు సమయంలో చేతులకు బేడీలతో వీల్ చైర్ లో వచ్చారు వెయిన్ స్టీన్.తమను వెయిన్ స్టీన్ రేప్ చేశాడంటూ మరియం హేలీ, జెస్సి కామన్ లు ఆరోపించారు. మీటూ ఉద్యమాన్ని రగిలిం చారు. వెయిన్ స్టీన్ ను కోర్టుకు లాగి విజయం సాధించారు. తీర్పును ఇద్దరు బాధితులు,వారి తరఫున వాదించిన లాయర్లు, మీటూ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లు స్వాగతించారు.

వెయిన్ స్టీన్ తరఫున వాదించిన లాయర్ డోనా రొటు నో మాత్రం ఇది పిరికిపంద చర్య అని తప్పుబట్టారు. తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ ఇప్పుడు కూడా వెయిన్ స్టీన్ కు శిక్ష పడకపోయి ఉంటే, తనకు జరిగిన ఘటనలే మళ్లీ మళ్లీ జరిగేవని హేలీ అన్నారు. చట్టంకన్నా అతడేం ఎక్కువ కాదని తీర్పు స్పష్టం చేసిందన్నారు. కేసు వాదనల సందర్భంగా మారుమాటైనా మాట్లాడని వెయిన్ స్టీన్ , తీర్పు తర్వాత దాదాపు 20నిమిషాలు మాట్లాడారు. జరిగిన ఘటనలకు పశ్చాత్తాప పడుతున్నానని అన్నారు. 2006లో మాన్హట్టన్ లోని తన ఇంట్లో వెయిన్ స్టీన్ తనతో బలవంతంగా ఓరల్ సెక్స్ చేశాడని ఆయన ఆఫీస్ లో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పనిచేసే హేలీ ఆరోపించారు.సినిమా చాన్సు ఇస్తానంటూ 2013లో న్యూయార్క్​లోని హోటల్ లో తనపై అత్యాచారానికి పాల్పడ్డా డని జెస్సి కామన్ ఆరోపించారు. ఆ ఇద్దరూ మీటూతో ఉద్యమం స్టార్ట్ చేశారు. వెయిన్ స్టీన్ ను కోర్టుకీడ్చారు. తర్వాత ఇండియా సహా అన్ని దేశాల్లో మీటూ ఉద్యమం ఎంతలా పెరిగిపోయిందో తెలిసిందే.

Latest Updates