హర్యానాలో సడలింపులతో 28 వరకు లాక్ డౌన్

హర్యానాలో సడలింపులతో 28 వరకు లాక్ డౌన్
  • కర్ఫ్యూ ఆంక్షల సడలింపు

చండీఘడ్: కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులతో ఈనెల 28 వరకు లాక్ డౌన్ పొడిగించింది. అన్ని ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాలు పూర్తి స్తాయి సిబ్బందితో పనిచేసేందుకు అనుమతిచ్చింది. అలాగే స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్లు ప్రారంభించేందుకు అనుమతిచ్చింది. అయితే సామాజిక భౌతిక దూరం ( సోషల్ డిస్టెన్స్) పాటించాలని, మాస్కులు తప్పనిసరి గా ధరించాలని తదితర కరోనా కేంద్ర మార్గదర్శకాల మేరకు కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. 
పెళ్లిళ్లు ఇతర వేడుకలకు, అంత్యక్రియలకు ప్రస్తుతం 20 మంది వరకు అనుమతి ఉండగా.. ఆ పరిమితిని పెంచుతూ 50 మంది వరకు పాల్గొనేందుకు అనుమతిచ్చింది.