53 ఏళ్లలో హర్యానా మహిళా ఎంపీల సంఖ్య ఐదు

హర్యానా రాష్ట్రంలో మహిళలు రాజకీయాలపై పెద్దగా ఆసక్తిచూపించడంలేదు. రాష్ట్రం నుంచి ఇంతవరకు  కేవలం ఐదురుగు విమెన్‌‌ సభ్యులు మాత్రమే లోక్‌‌సభకు  ఎన్నికయ్యారు. రాష్ట్రం ఏర్పడి 53 ఏళ్లవుతున్నా ఈపరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. మే 12న జరగనున్న పది సీట్లకు కేవలం 11 మంది మాత్రమే పోటీపడుతున్నారు.  2014 ఎన్నికల్లో ఒక్క మహిళా ప్రతినిధి కూడా లోక్‌‌సభలోకి అడుగుపెట్టక పోవడం విశేషం.  ఇంతవరకు రాష్ట్రం నుంచి ఎంపికైన 151 ఎంపీల్లోనూ ( పంజాబ్‌‌లో  కలిసి ఉన్నప్పుడు)  ఎనిమిదిసార్లు మాత్రం మహిళలు ఎంపీలుగా గెలిచారు. పది నియోజకవర్గాల్లోని ఆరు స్థానాల్లో ఒక్కసారి కూడా ఒక్క మహిళ కూడా ఎంపీగా గెలవలేదు. ఇండిపెండెంట్లుగా పోటీచేసిన ఒక్కామె కూడా లోక్‌‌సభలో అడుగుపెట్టలేదు. అయినప్పటికీ ఈసారి పోటీస్తున్న 11 మందిలో ఏడుగురు ఇండిపెండెంట్లగా బరిలోకి దిగడం విశేషం.

1999 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఇద్దరు మహిళా ఎంపీలు లోక్‌‌సభలో అడుగుపెట్టారు. ఈసారి ఎన్నికల్లో మాజీ బ్యూరోక్రాట్‌‌, విద్యాసంస్థలు నడుపుతున్న మహిళలు పోటీచేయడం విశేషం. సిర్సా నియోజకవర్గం నుంచి మాజీ బ్యూరోక్రాట్‌‌ సునీత దుగ్గల్‌‌  బీజేపీ టికెట్‌‌పై పోటీచేస్తున్నారు. ఢిల్లీ నేషనల్‌‌ కేపిటల్‌‌ రీజియన్‌‌లో యూరో గ్రూప్‌‌ ఆఫ్‌‌ స్కూల్స్‌‌ నడుపుతున్న స్వాతి యాదవ్‌‌  భివాణి-మహేందర్‌‌గఢ్‌‌ నుంచి ఆమ్‌‌ఆద్మీపార్టీ తరపున పోటీచేస్తున్నారు.

శ్రుతి చౌధురి…..

బన్సీలాల్‌ మనవరాలు శ్రుతి చౌధురి ఈసారి భివాణి-మహేందర్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. ఆమె 2009లోనూ ఎంపీగా పనిచేశారు. మహిళలు మంచి పొలిటీషియన్స్‌గా రాణించగలరు అనడానికి మా అమ్మ (కిరణ్‌ ఛౌధరి) నిదర్శనం.  అయితే కొద్దిమంది విమెన్‌ ఎంపీలు ఎన్నికవ్వడం బాధేస్తోందన్నారు.

చంద్రావతి…

1997లో జరిగిన ఎన్నికల్లో జనతాపార్టీ తరపున భివాణి నియోజకవర్గం నుంచి పోటీచేసిన చంద్రావతి సీనియర్‌ నాయకుడు బన్సీలాల్‌ను ఓడించినతొలి మహిళా ఎంపీగా రికార్డుల్లోకి ఎక్కారు.  ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరారు. 1990లో పుదుచ్చేరి గవర్నర్‌గా కూడా పనిచేశారు.

కుమారి సెల్జా...

హర్యానా రాజకీయాల్లో కుమారి సెల్జాకు మంచి రికార్డే ఉంది. లోక్‌సభకు మూడు సార్లు ఎంపికయ్యారు.  కేంద్రమంత్రిగా పనిచేశారు. ఈసారి ఆమె అంబాలా నుంచి పోటీచేస్తున్నారు.  సమస్యల పరిష్కారానికి మరింతమంది మహిళా నాయకులు రావాలని ఆమె అన్నారు.

Latest Updates