కోవ్యాక్సిన్ ట్రయల్ డోస్‌ తీసుకున్న మంత్రికి కరోనా

చండీగఢ్: హర్యానా హెల్త్ మినిస్టర్ అనిల్ విజ్‌‌కు కరోనా సోకింది. కోవ్యాక్సిన్ ట్రయల్ డోస్‌‌కు హాజరైన కొన్ని రోజులకే ఆయనకు వైరస్ పాజిటివ్‌‌గా తేలింది. అనిల్ ట్రయల్ వ్యాక్సిన్ తీసుకున్న ఆస్పత్రిలోనే తిరిగి చేరారు. గత నెల 20న అనిల్ విజ్ కోవ్యాక్సిన్ ట్రయల్ డోస్‌‌ తీసుకున్నారు. కోవ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌‌లో విజ్ తొలి వాలంటీర్‌‌గా చేరారు. కోవ్యాక్సిన్‌‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో కలసి భారత్ బయోటెక్‌‌ రూపొందిస్తోంది. ‘నాకు కరోనా పాజిటివ్‌‌గా తేలింది. అంబాలాలోని ప్రభుత్వాసుపత్రిలో అడ్మిట్ అయ్యా. నాతో కాంటాక్ట్‌‌లో వచ్చిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోండి’ అని అనిల్ విజ్ ట్వీట్ చేశారు.

Latest Updates