ఎదురుకట్నంతో ఉడాయించిన నిత్యపెళ్లి కూతురు

నమ్మించి మోసం చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఈ కిలాడీ చేసే మోసాలు చూస్తే షాక్ కావాల్సిందే. అమాయకపు మగవారితో పరిచయం పెంచుకుంటుంది. ప్రేమలో పడేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటుంది. ఓ వారం రోజులు గడిచాక నగలు, డబ్బులతో ఉడాయిస్తుంది. ఇలాంటివి ఇప్పటికీ 20సార్లు చేసిన ఈ నిత్యపెళ్లికూతురు ఈ సారి ఓ వ్యక్తి పెళ్లి చేసుకుని ఎదురుకట్నం తీసుకుని మరీ ఉడాయించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే… హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన సురేందర్(36) అనే వ్యక్తి ఇటీవల వివాహమైంది. భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె వయసు 28ఏళ్లు.  ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. తీరా ఆ కట్నం డబ్బు, పెళ్లి నగలు తీసుకొని ఉడాయించింది. భార్య కనపడం లేదని పోలీసులను ఆశ్రయించిన వరుడికి ఊహించని షాక్ తగిలింది.

పోలీసుల దర్యాప్తులో ఆమె ఒక దొంగ అని తేలింది. పెళ్లి కావాల్సిన యువకులను టార్గెట్ చేసుకొని మరీ… ఇలా డబ్బులు కొట్టేయడం ఆ యువతికి వెన్నతో పెట్టిన విద్య. ఈ దందా చేయడంలో పెద్ద గ్రూపే ఉంది. ఆ గ్రూప్ అంతా కలిసి ప్రీ ప్లాన్డ్ గా యువకులను మోసం చేస్తారని తేలింది. ఇప్పటి వరకు 20 మందిని ఇలా మోసం చేశారని పోలీసులు చెబుతున్నారు. అసలే ఫస్ట్ భార్య చనిపోయిందని బాధతో మరో భార్యని చేసుకుంటే రెండో భార్య కూడా పోవడంతో కన్నీరుమున్నీరయ్యాడు సురేందర్. పరిచయంలేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించిన పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

Latest Updates