హత్రాస్ దారుణం : బాధితురాలితో నిందితుడి ఫోన్ సంభాషణపై ప్రశ్నల వర్షం

హత్రాస్ దారుణంపై సీబీఐ అధికారుల విచారణ వేగవంతం చేశారు. శుక్రవారం నిందితుడి ఇంట్లో రక్తం మరకలు అంటిన దుస్తుల్ని స్వాధీనం చేసుకున్న అధికారులు..శనివారం బాధితురాలి కుటుంబసభ్యుల్ని 5గంటల పాటు విచారించారు.

ఈ దారుణంలో ప్రధాని సాక్షిగా ఉన్న చోటు తో పాటు  బాధితురాలు నలుగురు నిందితుల్లో ఒకరితో గతంలో ఫోన్ లో మాట్లాడిన కాల్ రికార్డ్స్  ఆధారంగా  సీబీఐ అధికారులు కేసులో బాధితురాలి తల్లి, బావను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా సీబీఐ అధికారులు మాట్లాడుతూ అక్టోబర్ 13న బాధితురాలి కుటుంబసభ్యుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి నిందితులు, బాధితురాలి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.

Latest Updates