యూపీ : పోస్ట్ మార్టం నివేదికలో దారుణం..పదేపదే గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించి

పదేపదే గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించడం వల్లే హత్రాస్ జిల్లా గ్యాంగ్ రేప్ బాధితురాలి వెన్నుపూస విరిగినట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది.

సెప్టెంబర్ 14న హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు ఉన్నత వర్గానికి నలుగురు కీచకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు చికిత్స పొందుతూనే కన్నుమూసింది. అదే రోజు రాత్రి పోలీసులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా..వారిని బంధించి బలవంతంగా దహన సంస్కారాలు నిర్వహించారు.

తాజాగా బాధితురాలి పోస్ట్ మార్టంపై ముగ్గురు డాక్టర్లు నివేదికను తయారు చేశారు. ఆ నివేదికలో గర్భాశయ వెన్నెముక విరిగి తీవ్రగాయమైనట్లు పేర్కొన్నారు.  ఆమెను గొంతును పదేపదే పిసికి చంపేందుకు ప్రయత్నించిన గుర్తులు ఆమె మెడపై ఉన్నట్లు డాక్టర్ల నివేదికలో తేలింది.

దారుణం అనంతరం అలీఘర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు..బాధితురాలిపై ఎటువంటి అత్యాచారం జరగలేదని, కేవలం గాయలైనట్లు నివేదికను విడుదల చేశారు. అంతేకాదు ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామని, ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే దృవీకరిస్తామని వైద్యులు చెప్పినట్లు  హత్రాస్ ఎస్పీ మీడియాకు చెప్పడం మరింత వివాదంగా మారింది.

Latest Updates