ఉత్తర్ ప్రదేశ్ మృగాళ్ల వేట : కుటుంబసభ్యుల్ని బంధించి అంత్యక్రియలు చేసిన పోలీసులు

నాలుగు మానవ మృగాళ్ల వేటలో తనువు చాలించిన బాధితురాలి అంత్యక్రియలను కుటుంబసభ్యుల్ని నిర్భందించి నిర్వహించారు.  

 ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో 19ఏళ్ల యువతిని ఉన్నత వర్గానికి చెందిన నలుగురు కిరాతకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తన తల్లి, అన్నతో కలిసి బాధితురాలి గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లింది.

అన్న కోసిన గడ్డిని ఇంటికి తీసుకెళ్లగా..తల్లి, బాధితురాలు కొద్ది దూరంలో ఉండి గడ్డి కోస్తున్నారు. అదే సమయంలో సందీప్,రాము,లవ్ కుష్,రవిలు బాధితురాలి గొంతుకు చున్నీ బిగించి బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు.

ఈ దారుణం నుంచి ప్రతిఘటించేందుకు బాధితురాల్ని ప్రయత్నించగా నిందితులు. బాధితురాలి నాలుకను కోసి, వెన్నుపూస విరగొట్టి చిత్రంహింసలకు గురిచేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ యువతి కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఆమెను వెతగ్గా..ఆపస్మారక స్థితిలో నిర్జీవమై కనిపించింది. దీంతో అత్యవసరచికిత్స కోసం ఢిల్లీలోని ఎఎంయూలో చేర్చారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి క్షీణించడంతో సప్దర్ జంగ్ ఆసుపత్రిలో చేర్చగా.. రెండు వారాలుగా పోరాడి చివరకు తనువు చాలించింది.

అనంతరం బాధితురాలి డెడ్ బాడీని ఆస్పత్రి నుంచి నివాసానికి తీసుకొచ్చారు. అక్కడ భారీ ఎత్తున మొహరించిన పోలీసులు..ఆమె కుటుంబసభ్యుల్ని ఇంట్లో బంధించారు.

సాంప్రదాయం ప్రకారం దహనసంస్కారాలు నిర్వహించాలని వేడుకున్నా పట్టించుకోని  ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున 2.30గంట సమయంలో బలవంతంగా దహనం చేశారు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మృతదేహాన్ని అప్పగించకుండా పోలీసులే దహనం చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Latest Updates