‘ఈ సీజన్‌‌లోనూ ఓపెనర్‌‌గానే దిగబోతున్నా’

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదమూడో సీజన్ మరో రెండ్రోజుల్లో మొదలవ్వనుంది. లీగ్‌‌ను ఘనంగా ఆరంభించాలని అన్ని టీమ్స్ ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ టీమ్ గురించి ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. టీమ్ సన్నాహకాలు, మరిన్ని విశేషాలను రోహిత్ పంచుకున్నాడు. ‘గత టోర్నీ మొత్తం నేను ఓపెనర్‌‌గా దిగా. ఈ ఏడాది కూడా అదే పొజిషన్‌‌‌లో దిగుతా. ఇందుకు నేను హ్యాపీగా ఉన్నా. నేను ఇండియాకు ఆడినప్పుడు జట్టు నుంచి మేనేజ్‌‌మెంట్‌‌కు ఒక విషయం చెప్పేవాళ్లం. అన్ని ఎంపికలను తెరిచి ఉంచమనే చెప్పేవాళ్లం. ఇప్పుడు ముంబైలో కూడా అలాంటి విధానాన్నే అమలు చేయబోతున్నాం’ అని రోహిత్ చెప్పాడు. క్రిస్ లిన్, క్వింటన్ డికాక్ లాంటి ప్లేయర్లతో బ్యాటింగ్ కాంబినేషన్ బాగుందని ముంబై కోచ్ జయవర్దనే పేర్కొన్నాడు.

Latest Updates