హైదరాబాద్ లో భారీ వర్షం.. బారులు తీరిన ట్రాఫిక్

హైదరాబాద్ లో మళ్లీ వాన మొదలైంది. మొన్నటి వాన దెబ్బకు ఇప్పటికీ వరద నీటితో నిండిన కాలనీలు ఇంకా ఖాళీ కాలేదు. కొన్ని చోట్ల వరద పోయినా బురద అట్లనే ఉంది. ఇప్పుడు  సరూర్ నగర్, కొత్తపేట, చంపాపేట, మలక్ పేట, చాదర్ ఘాట్,  సైదాబాద్ తో పాటు… వనస్థలిపురం, కోఠి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాల్లో వర్షం పడుతోంది.  ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్ లో కుండపోతగా వర్షం పడుతోంది.  నగర శివారల్లోనే రాజేంద్ర నగర్, అత్తాపూర్,  బండ్లగూడ, నార్సింగ్, గండిపేట్, మణికొండలో భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షం పడే చాన్సుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

వర్షంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లన్నీ జలమయం కావడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు వర్షం.. ఇటు ట్రాఫిక్ కష్టాలతో ఆగమైతున్నరు.

Latest Updates