హవా : మూవీ రివ్యూ

రివ్యూ : హవా
రన్ టైం : 1 గంటల 40 నిమిషాలు.

కథేంటి:
చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన చార్లీ (చైతన్య మాదాడి) జీవనం కోసం చిన్న చిన్న నేరాలు చేస్తూ పెరుగుతాడు. వీటితో విసిగిపోయిన చార్లీ ఏదైనా పెద్ద క్రైమ్ చేసి సెటిల్ అయిపోవాలని నిర్ణయించుకొని ఆస్ట్రేలియాలోని డార్క్ హార్స్ రైడింగ్ బెట్టింగ్ మాఫియాలోకి అడుగుపెడతాడు. అదే అతనికి ప్రాణాలకి హాని కలిగేలా చేస్తుంది. అప్పటికే అక్కడున్న క్రిమినల్ గ్యాంగ్స్ బారి నుండి చార్లీ ఎలా తప్పించుకున్నాడు ? తన కలలని చార్లీ ఎలా తీర్చుకున్నాడన్నది తెర మీదే చూడాలి.

నటీనటుల పెర్ఫార్మెన్స్:
చైతన్య డీసెంట్ నటనతో ఆకట్టున్నాడు. సినిమా మొత్తం తన చుట్టూనే తీరిఉగుతుండటం తో పెద్దగా పక్కనొల్లని పట్టించుకునే పనుండదు. హీరోయిన్ గా చేసిన దివి ప్రసన్న ఉన్నది కాసేపే అయినా ఆ పాత్రలో మెప్పించింది. మిగిలిన వారందరు కూడా కొత్తవారు కావడంతో సో సో గా చేసేసారు.
టెక్నికల్ వర్క్:
సినిమాటోగ్రఫీ విషయానికొస్తే ఆస్ట్రేలియా లోని అందాలని బాగా చూపించారు. గిఫ్టన్ అలియాస్ మ్యూజిక్ పరవాలేదనిపించింది. రీరికార్డింగ్ తో ప్రతి సీన్ ఎలివేట్ అయ్యేలా చేసాడు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయి కి తగ్గట్లుగా ఉన్నాయి.

విశ్లేషణ:
క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హవా మేజర్ పార్ట్ వరకు మెప్పిస్తుంది.దర్శకుడు మహేష్ రెడ్డి కొత్తవాడైనా..కథలో ట్విస్ట్స్ ని మలచిన తీరు ఆకట్టుకునేలా బావుంది.ట్విస్టులు టర్న్ లతో ఆసక్తి రేకెత్తించాడు. క్లైమాక్స్ ని వివరించిన తీరు ఆకట్టుకుంది. అయితే మధ్యలో కొన్ని అనవసరమైన సన్నివేశాలతో కథ పక్కదారి పట్టించాడు.అయితే చివర్లో సస్పెన్స్ ని బాగా క్యారీ చేసాడు.ఓవరాల్ గా హవా మంచి ప్రయత్నంగా మిగులుతుంది.కొత్తవాళ్ళైనా ఫర్వా లేదనిపించారు.

Latest Updates