హైదరాబాద్ లో రూ.3 కోట్లకి పైగా హవాలా డబ్బు.. ముఠా అరెస్ట్

హైదరాబాద్:  హవాలా ముఠా గుట్టును రట్టు చేశారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. రూ.3కోట్ల 70 లక్షల 30 వేల డబ్బు హవాలా రూపంలో మల్లిస్తున్న గ్యాంగ్ ను మంగళవారం పట్టుకున్నట్లు తెలిపారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇదే విషయంపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. హవాలా రూపంలో డబ్బును తరలిస్తున్న నలుగురిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు.

మంగళవారం ఉదయం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్  12లో మహీంద్ర స్కార్పియో, హ్యుందాయి అసెంట్ కార్లలో డబ్బులు తరలిస్తుండగా ముఠాను పట్టుకున్నారని తెలిపారు సీపీ. ఈశ్వర్ దిలీప్ జీ, హరీష్ రామ్‌బాయ్, అజిత్ సింగ్, రాథోడ్ అనే వ్యక్తులను అరెస్ట్‌ చేశారన్నారు. వీళ్లంతా గుజరాత్ కు చెందినవారని…రూ. 3కోట్ల 75 లక్షల 30 వేల నగదు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారు..ఇది ఎవరికి సంబంధించింది అనేదానిపై ఇన్ కం టాక్స్ కు సమాచారం ఇచ్చామని..వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలిపిన సీపీ అంజనీ కుమార్ ..  స్వాధీనం చేసుకున్న హవాలా డబ్బును ఐటీశాఖకు అప్పగిస్తామని‌ తెలిపారు.

 

Latest Updates