వరద బాధితుల‌కు భోజన సేవలందించిన బీజేపీ నాయకులు

ఎల్బీ నగర్: హయత్ నగర్ లో భారీ వ‌ర్షాలు, వరద తీవ్రతతో ఇండ్లు కోల్పోయిన బాధితులకు అండగా నిలబడ్డారు బీజేపీ నాయకులు. వారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు. గత మంగళవారం నుండి హయత్ నగర్ లోని అంబేద్కర్ కాలనీ, రంగనాయకుల గుట్ట, బంజారా కాలనీ, లేబర్ బస్తీలతో పాటు పద్మావతి నగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఇండ్లలోకి నీరు చేరి వరద ప్రవాహానికి అన్ని కొట్టుకుపోయాయి. దీనితో వారు ప్రాణాలతో పక్కనే ఉన్న బిల్డింగ్ లలోకి చేరుకున్నారు.

ప్ర‌జ‌ల ఇబ్బందుల గురించి తెలుసుకున్న‌ స్థానిక‌ బీజేపీ నాయకుడు కళ్లెం ప్రభాకర్ రెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌ల‌సి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. బుధవారం తెల్లవారుజామున అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వ‌ర‌ద బాధితుల‌కు తమ పూర్తి సహకారం ఉంటుందని , వరద ప్రవాహం ఉన్నన్ని రోజులు భోజన వసతి అందిస్తామని హామీ ఇచ్చారు. బుధవారంతో పాటు గురువారం కూడా సుమారు 2వేల కుటుంబాలకు భోజనాలు ఏర్పాటు చేశారు.

Latest Updates