బెయిల్​ రాగానే మరో కేసులో అరెస్టా?

రవిప్రకాష్‌‌  కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌‌, వెలుగు: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌‌కు బెయిల్‌‌ రాగానే పోలీసులు మరో కేసులో అరెస్ట్‌‌ చేయడంపై హైకోర్టు జడ్జి జస్టిస్ ​జి.శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో నమోదు చేసిన కేసుల్లో ఒకేసారి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇదంతా ఉద్దేశ పూర్వకంగానే చేస్తున్నారనే అభిప్రాయం ఏర్పడుతోందన్నారు. ఇటీవల బంజారాహిల్స్​ స్టేషన్​లో దాఖలైన కేసులో బెయిల్​ వచ్చిన రోజే మరో కేసులో  రవిప్రకాష్​ను అరెస్టు చేసి చంచల్​గూడ జైల్లోనే ఉండేలా చేశారు. ఫేక్​ ఈమెయిల్​ ఐడీ క్రియేట్​ చేశారన్న అభియోగాలపై అరెస్టు చేయడాన్ని రవిప్రకాష్​ హైకోర్టులో సవాల్​ చేశారు. తనను పోలీసుల కస్టడీకి అప్పగించకుండా స్టే ఇవ్వాలని ఆయన​ వేసిన క్వాష్​ పిటిషన్​ను జస్టిస్​ జి.శ్రీదేవి మంగళవారం విచారించారు. గురువారం వరకు స్టే ఉత్తర్వులు జారీచేస్తూ.. ఆలోగా కౌంటర్​ వేయాలని జస్టిస్​ శ్రీదేవి పోలీసులను ఆదేశించారు. అదేరోజు తుది విచారణ చేస్తామని వెల్లడించారు.

Read more News

Latest Updates