పోలీస్ స్టేషన్ కు చేరిన HCA వివాదం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లోని వివాదాలు పోలీస్ స్టేషన్ కు చేరాయి. HCAలోని ఇద్దరు ఉద్యోగుల లొల్లి.. HCA  కార్యవర్గ సభ్యుల్ని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. వివాదం ఏంటో తెలుసుకోకుండానే HCA ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కంప్టైంట్ చేశాడు. దీంతో ట్రెజరర్ సురేందర్, మెంబర్ మొయిజాద్దీన్ ను పీఎస్ కు తీసుకొచ్చారు పోలీసులు. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ తో పాటు జనరల్ సెక్రటరీ విజయానంద్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వివరణ తీసుకున్నారు.

అజారుద్దీన్ ఫిర్యాదు చేసేటప్పుడు..ఏం జరిగిందో తెలుసుకుంటే బాగుండేదని అంటున్నారు. తోటి కార్యవర్గ సభ్యులపై కంప్లైంట్ చేసేటప్పడు..ఓసారి మాట్లాడితే సరిపోయేదని చెప్తున్నారు. HCAలో జరుగుతున్న అక్రమాలు బయట పడతాయనే భయంతోనే కంప్లైట్  చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఏడాది కాలంగా HCAలో క్రికెట్ అభివృద్ధిపై పెద్దగా చర్చ లేకపోయినా.. ఇటువంటి గొడవలతో రచ్చకెక్కడంపై క్రికెట్ క్లబ్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అజారుద్దీన్ ఫిర్యాదుపై IPC 504, 506 కింద కేసులు పెట్టినట్టు సీఐ రంగస్వామి చెప్పారు.

Latest Updates