వచ్చే నెల‌ మెగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్న HCL

విజయవాడ:  ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ ఏపీలోని విజ‌య‌వాడ‌లో వర్ట్యువల్‌ మెగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహించనుంది. ఆ రాష్ట్రంలో అదనంగా 1000 మంది ఉద్యోగులను తీసుకోవడానికి ప్రణాళిక చేస్తున్న హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ గ్లోబల్‌ ఐటీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌… ‌ ఫిబ్రవరి 12–13,2021 తేదీలలో ఈ ‌ డ్రైవ్‌ను నిర్వహించబోతుంది. దాదాపు 1000 కొత్త ఉద్యోగావకాశాలను ఫ్రెషర్స్‌/ఎక‌్స్‌పీరియ‌న్స్‌‌డ్ ప్రొఫెషనల్స్‌కు గన్నవరంలోని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ క్యాంపస్ లో ఇంట‌ర్వ్యూలు జ‌ర‌గ‌నున్నాయి.

మెగా డ్రైవ్ వివ‌రాలు:

· వర్ట్యువల్‌ మెగా రిక్రూట్‌మెంట్‌ తేదీ : ఫిబ్రవరి 12 మరియు 13, 2021

· సమయం : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు

· దరఖాస్తుకు చివరి తేదీ : ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఫిబ్రవరి 11,2021వ తేదీ వరకూ మాత్రమే సమర్పించవచ్చు

· అభ్యర్ధులు తమ దరఖాస్తులను https://www.hcltech.com/careers/vijayawada కు పంప‌వ‌చ్చు

Latest Updates