HCU స్టూడెంట్ సూసైడ్ : 15వ అంతస్తు నుంచి దూకేసింది

హైదరాబాద్  లోని శేరిలింగంపల్లిలో విషాదం. నల్లగండ్లలోని హిమసాయి అపార్ట్‌మెంట్‌ లోని 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వెస్ట్‌ మారేడ్‌ పల్లికి చెందిన 18 ఏళ్ల హర్షిత.. గురువారం (జూలై-19) హిమసాయి అపార్ట్‌మెంట్‌ కు వచ్చింది.  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హర్షిత.. సిస్టమ్స్ బయాలజీ చదువుతుంది. మృతురాలి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. హర్షిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

అపార్టుమెంట్‌ కు వెళ్లినప్పుడు ఆమె గేటు వద్ద రాసిన వివరాలను పోలీసులు అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని అడిగి తెలుసుకొని ఆ ఇంట్లోకి వెళ్లగా.. అక్కడ ఎవరూ ఉండటంలేదని, ప్రస్తుతం ఆ ప్లాట్‌ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని గుర్తించారు. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. అయితే, హర్షిత ఈ ఫ్లాట్‌కు ఆత్మహత్య చేసుకొనేందుకే వచ్చిందా?.. లేదంటే ఆమె స్నేహితులు ,బంధువులు ఎవరైనా ఉన్నారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం హర్షిత మృతదేహాన్ని సికింద్రాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా మృతురాలి తల్లి అక్కడి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates