జింకపై కాల్పులు.. హైదరాబాద్ యూనివర్సిటీలో కలకలం

హైదరాబాద్ : గుర్తు తెలియని వ్యక్తులు జింను కాల్చి చంపారు. ఈ సంఘటన గురువారం ఉదయం హైదరాబాద్ లో జరిగింది.  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లోని క్యాంపస్ స్పోర్ట్స్ రైఫిల్ షూటింగ్ సెంటర్ లో చనిపోయిన జింక కనిపించింది. ఇవాళ ఉదయం కాల్పుల మోత వినబడటంతో.. విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై అక్కడికి చేరుకున్నారు. అక్కడ చనిపోయిన జింక ఉంది. అంతలోపే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. జింక శరీరంలో బుల్లెట్ ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగులు జింకను చంపి, తీసుకెళ్దామనే పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. స్టూడెంట్స్ అక్కడికి చేరుకోవడంతో జింకను దుండగులు అక్కడే వదిలి వెళ్లారని అనుమానిస్తున్నాయి యూనివర్సిటీ వర్గాలు.

 

Latest Updates