దేవెగౌడ కామెంట్స్ అన్నీ అసత్యాలే: సదానంద గౌడ

HD Devegowda Raise Operation Kamala in Parliament

HD Devegowda Raise Operation Kamala in Parliamentలోక్ సభలో కర్ణాటక రాజకీయాలపై నిరసనలు కొనసాగాయి. కర్టాటకలో బీజేపీ ప్రలోభాలు చేస్తోందంటూ సభలో ప్రస్తావించారు. కర్ణాటక సీఎం కుమారస్వామి విడుదల చేసిన ఆడియో టేపులో ఏముందన్న విషయాలను లోక్ సభలో వెల్లడించారు ఖర్గే. 50 కోట్లు ఇస్తామంటూ యడ్యూరప్ప గుర్ మిట్కల్ ఎమ్మెల్యే కొడుకుతో మాట్లాడారని ఆరోపించారు. దీనిపై బీజేపీ సభ్యులు నిరసనలు తెలిపారు. ఆ తర్వాత మాట్లాడిన మాజీ ప్రధాని దేవెగౌడ… ఆపరేషన్ కమల 2009 నుంచే మొదలైందన్నారు. నాడు 10 మంది మంత్రులు రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కావొద్దన్నారు. ఖర్గే, దేవెగౌడ కామెంట్స్ అన్నీ అసత్యాలే అని కేంద్రమంత్రి సదానంద గౌడ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్, జేడీఎస్ మధ్య విబేధాలు ఉన్నాయన్నారు. రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని, దీంతో ఓ ఎమ్మెల్యే పది రోజుల పాటు హాస్పిటల్ లో ఉన్నాడని గుర్తు చేశారు.

Latest Updates