ఎస్ బి ఐ బాటలో హెచ్ డిఎఫ్ సి.. లోన్ల చెల్లింపు గడువు పొడిగింపు

రీస్ట్రక్చరింగ్‌ స్కీమ్‌ ప్రకటించిన హెచ్ డి ఎఫ్ సి

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ మాదిరిగానే హెచ్ఎఫ్ బ్యాంక్‌ కూడా లోన్ల చెల్లింపుల్లో వెసులుబాటు ఇవ్వడానికి లోన్‌ రీస్ట్రక్చరింగ్‌ స్కీమ్ ప్రకటించింది. అంటే కరోనా వల్ల ఇబ్బందిపడుతున్న బ్యా రోవర్లకు మారటోరియం ఇవ్వనుంది. ఈ ఏడాది మార్చి తరువాత నుంచి లోన్ల కిస్తీలు చెల్లించని వారు మాత్రమే స్కీమ్ కు ఎలిజబుల్‌ కరోనా వల్ల తమ ఆదాయం/జీతం/బిజినెస్‌ తగ్గిందని నిరూపిస్తేనే మారటోరియం ఇస్తారు. రీస్ట్రక్చరింగ్‌ స్కీమ్‌ కోసం బ్యాంకు వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అన్ని డాక్యుమెంట్లను పరిశీలించాక మారటోరియంపై బ్యాంకు నిర్ణయం తీసుకుంటుంది. రెండేళ్ల వరకు మారటోరియం ఇస్తారు. జాబ్‌ లేదా బిజినెస్‌ ఇప్పుడు ఎలా ఉందో నిరూపించే డాక్యుమెంట్లను బారోవర్లు బ్యాంకుకు అందజేయాలి. శాలరీ బారోవర్లు శాలరీ స్లిప్స్‌/బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వంటి వి అందజేయాలి. సెల్ఫ్‌ ఎంప్లాయింట్‌ కేటగిరీలోకి వచ్చేవాళ్లు బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌, జీఎస్టీ రిటర్నులు, ఐటీ రిటర్ను ల వంటి వి అందిం చాలి. చిన్న పరిశ్రమలు https://udyamregistration.gov.in/Government-of-India/Ministry-of–MSME/onlineregistration.html లింక్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే రీస్ట్రక్చరింగ్​కు బ్యాంక్‌ ప్రత్యేక ఫీజును వసూలు చేస్తుంది. రూ.25 వేలు లేదా అంతకంటే ఎక్కువ లోన్‌కు మారటోరియం ఉంటుంది.

Latest Updates