రూ.4 వేల కోట్ల అప్పు తీసుకున్న హెచ్‌డీఎఫ్‌సీ

న్యూఢిల్లీ: ప్రస్తుతం మార్కెట్లో తక్కువ వడ్డీకే అప్పులు దొరుకుతున్నప్పటికీ హౌజింగ్ లోన్లు ఇచ్చే ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ ‘హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ లిమిటెడ్’ మాత్రం ఏడాదికి 7.25 శాతం వడ్డీతో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల నుంచి రూ.నాలుగు వేల కోట్ల అప్పు తీసుకుంది. ఆర్బీఐ రెపోరేట్లు తగ్గించడం వల్ల బ్యాంకులు తక్కువ వడ్డీలకే అప్పులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎకానమీ క్రైసిస్ టైమ్‌‌‌‌లోనూ ఇంత ఎక్కువ వడ్డీ చెల్లించడం విశేషమేనని డెట్ డీలర్ ఒకరు అన్నారు. పదేళ్ల గవర్నమెంటు సెక్యూరిటీ బాండ్లపై గరిష్టంగా 5.90 శాతం మాత్రమే వడ్డీ చెల్లిస్తున్నారు. అయితే గవర్నమెంట్ల బాండ్ల సప్లై విపరీతంగా ఉన్నందున ఈ వడ్డీ ఆరు శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోవా, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలు పదేళ్ల డెవెలప్‌‌‌‌మెంట్ బాండ్స్‌‌‌‌కు 6.6 శాతం వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నాయి. అయితే యాక్సిస్ బ్యాంకు రూ.2,650 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.1,350 కోట్లను 7.25 శాతం వడ్డీకి హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీకి అప్పుగా ఇచ్చాయి.

కో –ఆపరేటివ్ బ్యాంకులు కూడా ఆర్బీఐ నీడకే

Latest Updates