‘నానో’కాప్టర్​..ఎగరదులెండి

నాలుగు టైర్లు.. లోపల్​ స్టీరింగ్​, తోక, రోటర్లు, పైన నాలుగు బ్లేడ్ల పంక.. అరే, హెలికాప్టరేంటి కారులా ఉంది అన్న డౌటొచ్చిందా! నిజంగా అది నానో కారే. కానీ, దానికి హెలికాప్టర్​ టచ్​ ఇచ్చి ‘నానో’కాప్టర్​ తయారు చేశాడు బీహార్​కు చెందిన మిథిలేశ్​ ప్రసాద్​ అనే యువకుడు. ఛాప్రా అనే ఊరికి చెందిన మిథిలేశ్​కు పైలట్​ అవ్వాలన్నది కల. ఆ కలను తీర్చుకోవడానికి కొత్తగా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాడు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే ఈ నానోకాప్టర్​. హెలికాప్టర్​ తయారు చేయాలన్న పట్టుదలున్నా అందుకు అతడి ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఇట్ల చేశాడు. ‘‘చిన్నప్పటి నుంచి పైలట్‌ కావాలన్న ది నా కల. హెలికాప్టర్​ తయారు చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. కానీ, మా పరిస్థితి అంత బాగా ఏమీలేదు. మాది మధ్యతరగతి కుటుంబం. అందుకే మాకున్న ఈ నానో కారునే ‘హెలికాప్టర్​’గా మార్చేశా” అని మిథిలేశ్​ చెప్పాడు. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్​ ఉంది. హెలికాప్టర్​ లుక్కు ఇచ్చినా అది మాత్రం గాల్లో ఎగరదు. కలను నిజం చేసుకోవడానికి జస్ట్​ అట్ల హెలికాప్టర్​ కలరింగ్​ ఇచ్చిండంతే! బాగుంది కదా, ఎగరని ఈ హెలికాప్టర్​ లాంటి నానోకాప్టర్​!

 

Latest Updates