ట్రంప్ పై స్పీకర్ నాన్సీ పెలోసి తీవ్ర విమర్శలు

వాషింగ్టన్ : అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కుక్క మలం షూ కు పూసుకొని తిరిగే వ్యక్తంటూ రిప్రజెంటివ్ సభ స్పీకర్ నాస్సీ పెలోసి తీవ్ర వాఖ్యలు చేశారు. తనతో దాన్ని అందరికీ పూస్తాడని అన్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి తర్వాత హోదా లో ఉన్నారు స్పీకర్ నాన్సీ. ఆమె డెమెక్రట్ పార్టీకి చెందిన వారు. ట్రంప్, స్పీకర్ నాన్సీ లకు ఒకరంటే ఒకరికి పడదు. దాదాపు ఆరు నెలలుగా వాళ్లద్దరూ మాట్లాడుకోవటం లేదు. ఐతే అధ్యక్షుడిపై ఇలాంటి తీవ్రమైన విమర్శలు చేయటం సంచలనం రేపింది. కొన్ని రోజుల క్రితం ట్రంప్ ఓ టీవీ హోస్ట్ సైకో అంటూ విమర్శించారు. ఆ అంశాన్ని నాన్సీ వద్ద ప్రస్తావించగా ట్రంప్ ను ఉద్దేశించి ఇలాంటి తీవ్ర కామెంట్లు చేశారు. “ట్రంప్ షూ స్ కు కుక్క మలన్ని పూసుకొని తిరుగుతాడు. ఒక్కసారి పూసుకుంటే అది చాలా కాలం అలాగే ఉంటుంది. దాన్ని ట్రంప్ అందరికీ అంటించాలని చూస్తాడు” అని అన్నారు. వీరిద్దరీ మధ్య వ్యక్తిగత విమర్శలు లిమిట్ దాటుతుండటంపై డెమెక్రాట్లు, రిపబ్లికన్లు పరేషాన్ అవుతున్నారు. క్లోరిక్విన్ ట్యాబ్లెట్ వేసుకుంటనని ట్రంప్ ప్రకటించటంపై నాన్సీ విమర్శలు స్టార్ట్ చేశారు. ట్రంప్ ఒబిసిటి పేషెంట్ అని నైనేతై తాను క్లోరోక్విన్ సజ్జెస్ట్ చేయనని అన్నారు. దీనికి కౌంటర్ గా నాన్సీ పిచ్చిదని ఆమె ఒక రోగిస్టి అంటూ ట్రంప్ విమర్శించారు. మళ్లీ నాన్సీ ట్రంప్ పై దారుణమైన కామెంట్లు చేయటంతో ఆయనెలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.

Latest Updates