బైక్స్ కొంటానంటూ కొట్టేస్తున్నాడు

హైదరాబాద్‌‌,వెలుగు : ఓఎల్ ఎక్స్ లో బైక్లు కొంటానని నమ్మించి చోరీ చేస్తున్న వ్యక్తిని గోల్కొండ పోలీసులు బుధవారం అరెస్ట్చేశారు. రాజేంద్రనగర్‌ కిస్మత్‌ పురకు చెందిన బి.పృథ్వీ యాదవ్‌‌ ఫిబ్రవరిలో పల్సర్‌‌‌‌ బైక్ ‌‌కొని, అమ్మేందుకు ఓఎల్‌ఎక్స్‌‌లో పెట్టాడు. గత నెల 17న బైక్ కొంటానంటూ ఓ వ్యక్తి కాల్ చేసి షేక్‌‌పేట్‌‌లోని సాయిసుధ హోటల్‌ దగ్గరికి రమ్మన్నాడు. రూ.1.05లక్షలకు బేరం మాట్లాడి, తన తల్లికి చూపించిన తర్వాత డబ్బు ఇస్తానని నమ్మించి బైక్‌‌తో ఎస్కేప్ అయ్యాడు. బాధితుడు గోల్కొండ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. మొబైల్ నంబర్‌‌‌‌ఆధారంగా మహబూబ్‌నగర్‌‌‌‌జిల్లా నవాబ్పేట్‌‌మండలం కొత్తపల్లికి చెందిన గుడెపు నగేశ్‌‌అలియాస్ ఆంజనేయులు(21)ని నిందితుడిగా గుర్తించి మంగళవారం అరెస్ట్చేశారు. గత 7 నెలల్లో గోల్కొండ, కేపీహెచ్‌‌బీ, కుషాయిగూడ, భువనగిరిలో 5 బైక్స్ చోరీ చేశాడు. ఇదే తరహాలో గతేడాది షాద్నగర్‌‌‌‌, గచ్చిబౌలి, రాయదుర్గంపోలీస్‌‌ స్టేషన్స్‌‌ పరిధిలో మరో 3 బైకులు ఎత్తుకెళ్లాడు. అలా కొట్టేసిన వాటిని సెకండ్‌సేల్స్‌‌లో అమ్మేవాడు.

Latest Updates