భారత క్రికెటర్లను చంపుతానని బెదిరించింది ఇతడే..!

ముంబై: టీం ఇండియా క్రికెటర్లను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంలోని ధరమ్‌ తుల్ గ్రామానికి చెందిన బ్రజా మోహన్ దాస్ (20)అనే వ్యక్తి భారత క్రికెటర్లను హత్య చేస్తానని మెయిల్ ద్వారా BCCIకి  మెసేజ్ పంపించాడు. దీనిపై విచారణ చేపట్టిన మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజమ్ స్క్వాడ్ అధికారులు.. ఆగస్టు 20వ తేదీన అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాస్‌ ను ముంబైకి తరలించిన అధికారులు.. అతన్ని కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. ఆగస్టు 26వ తేదీ వరకూ బ్రజా మోహన్ దాస్‌ ను కస్టడీలో ఉంచుతామని తెలిపారు అధికారులు. అయితే దాస్ మానసిక పరిస్థితి బాగోలేదని.. అందుకే అతను అలా ప్రవర్తించాడని అతని సన్నిహితులు చెబుతున్నారు.

Latest Updates