
రూ.4 వేల కోసం చంపిండు
మర్డర్ కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్,వెలుగు : హెచ్ సీయూ ఎంప్లాయ్ సత్యనారాయణ(56) హత్య కేసులో నిందితుడిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపిన ప్రకారం..హైదర్ షా కోట్ కు చెందిన సత్యనారాయణ మద్యానికి బానిసై ఈ నెల 6న బండ్లగూడలో కల్లు కాంపౌండ్ కి వెళ్లాడు. అక్కడ పాతనేరస్థుడు మహ్మద్ అజీమ్‌ను పరిచయం చేసుకొని కలిసి కల్లు తాగారు. ఆ తర్వాత అజీమ్ మత్తులో ఉన్న సత్యనారాయణను హిమాయత్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి బండరాయితో మోది హత్య చేశాడు. మృతుడి జేబులోని రూ.4 వేలు తీసుకుని నిందితుడు పారిపోయాడు. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు కేసు ఫైల్ చేసి సీసీ ఫుటేజ్ సాయంతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.