93 ఏళ్ల వయసులో పీజీ పట్టా

ఢిల్లీ : చదువును నిర్లక్ష్యం చేసే కొంత మంది యువతీ, యువకులకు ఈ తాతయ్య ఆదర్శంగా నిలిచాడు. పీజీ చేయాలనే తన చిరకాల కోరికను నైంటీస్ లో నెరవేర్చుకున్నాడు. దేశం గర్వించేదగ్గ వ్యక్తిగా అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడే తమిళనాడుకు చెందిన శివ సుబ్రమణియన్. 93 ఏళ్ల వయస్సులో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. దీంతో మంగళవారం ఢిల్లీలో జరిగిన యూనివర్సిటీ కార్యక్రమంలో డిగ్రీ పట్టా అందుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు సుబ్రమణియన్.

ఈయన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతంది. చదువుకు వయస్సుతో సంబంధంలేదని శివ సుబ్రమణియన్ చాటి చెప్పాడంటూ ప్రశంసిస్తున్నారు. పట్టుదలతో చేస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదని.. హ్యాట్సాప్ తాతయ్య అంటున్నారు నెటిజన్లు.

see also: ‘నాన్న’కూ 7 నెలల సెలవులు

చెర్రీ నెక్స్ట్ సినిమా చిరుతోనా.. వెంకీతోనా..

Latest Updates