వినియోగదారులకు హోండా బంపర్ ఆఫర్..బైక్ పై రూ.43వేలు ఆదా

హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ ఎం ఎస్ ఐ) వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హోండా ఇటీవల  రెట్రో క్రూయిజర్ సీబీ 350 టూవీలర్ ను విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.85లక్షలు ఉండగా ఢిల్లీ వంటీ మెట్రో నగరాల్లో రూ1.90లక్షలుగా ఉంది. ఈ బైక్ అమ్మకాల్లో భాగంగా రూ.5వేల ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా 100శాతం ఫైనాన్స్ సౌకర్యాన్ని కల్పించింది. ఇక ఫెస్టివల్ సీజన్ సందర్భంగా హోండా షోరూముల్లో ఆఫర్ ప్రకటిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ లిమిటెడ్ ఆఫర్ లో బైక్ కొనుగోలు చేస్తే రూ.43వేలను సేవ్ చేసుకోవచ్చని హోండా ప్రకటించింది.

 

Latest Updates