ధోని బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలి

ధోని బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలి

చెన్నై: ఐపీఎల్ పద్నాలుగో సీజన్ ను చెన్నై సూపర్ కింగ్స్ పేలవంగా ఆరంభించింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. చెన్నై విధించిన 188 రన్స్ లక్ష్యాన్ని ఢిల్లీ అలవోకగా చేధించింది. పృథ్వీ షా (72), శిఖర్ ధవన్ (85) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విషయాన్ని పక్కనబెడితే ధోని ఎలా ఆడతాడనే దాని మీద అందరి దృష్టి నిలిచింది. కానీ డకౌట్ అయిన తల ఫ్యాన్స్ ను నిరాశ పర్చాడు. 

చిన్న తల రైనా మెరుపు ఇన్నింగ్స్ తో ఆకటుకున్నప్పటికీ ధోనీ వైఫల్యంతో 200ను చెన్నై చేరుకోలేకపోయింది. ధోని బ్యాటింగ్ పొజిషన్ పై లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. 'ధోని తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి పునరాలోచించాలి. తాను చివరి నాలుగైదు ఓవర్లు ఆడితే సరిపోతుందని అతడు భావిస్తున్నాడు. కానీ అతడు కాస్త పైన రావాలి. అతడు ముందే వచ్చి నిలదొక్కుకుని సామ్ కరన్ లాంటి యంగ్ స్టర్స్ ను గైడ్ చేయాలి' అని గవాస్కర్ అన్నాడు.