ఆయన నీటిపై వివక్షను ప్రతి ఒక్కరికీ చెప్పారు

  • నీటిపారుదల రంగ నిపుణులు ఆర్.విద్యాసాగర్ రావుకు హరీష్ నివాళి

నీటి విషయంలో తెలంగాణకు  జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేసిన నీ టిపారుదలరంగ ని పుణులు ఆర్‌‌.విద్యాసాగర్‌‌రావు సే వలు మరువలేనివని మాజీ మంత్రి టి.హరీశ్‌‌రావు కొని యాడారు. ఆయన రెం డో వర్ధంతి సందర్భంగా ని వాళులర్పిస్తూ సో మవారం ప్రకటన చేశారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారని,ఉమ్మడి ఏపీలో సాగునీటి వివక్షను ప్రతి సామాన్యుడికీ అర్థమయ్యేలా చెప్పారన్నారు. రాష్ట్రంలోని బీడు భూములకు సాగునీరందిం చాలన్న ఆయన కల త్వరలోనే సాకారం కానుందన్నారు. ఆయన భౌతికంగా దూరమైనా సీఎం కేసీఆర్‌‌ ఆయన కలలను నిజం చేసేందుకు శ్రమిస్తున్నారన్నారు. విద్యాసాగర్‌‌రావుకు ట్వి ట్టర్‌‌లో టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ నివాళులర్పించింది.

జలసౌధలో..

విద్యాసాగర్‌‌రావు జీవితం భావి ఇంజనీర్లు,యువతకు స్ఫూర్తి అని తెలంగాణ రిటైర్డ్‌‌ ఇంజనీర్ల అసోసియేషన్‌‌ ప్రధాన కా ర్యదర్శి శ్యాంసాద్‌‌రెడ్డి అన్నారు. విద్యాసాగర్‌‌ రెం డో వర్ధం తి సందర్భంగా జలసౌధలో ఆయన చిత్రపటానికి ఇంజనీర్లు పూలమాలలు వేసి ని వాళులర్పిం చారు. ఆయన పేరు చిరస్థాయిగా ని లిచేందుకు సీఎం కేసీఆర్‌‌ దిండి ప్రాజెక్టుకు ‘రామరాజు విద్యాసాగర్‌‌రావు దిండి ఎత్తిపోతల’ అని పేరు పెట్టారన్నారు. విద్యాసాగర్‌‌రావు తన గ్రామానికి విరాళంగా ఇచ్చిన భూమిలో కళ్యాణ మండపం నిర్మిం చాలని సీఎం కేసీఆర్‌‌ సంకల్పిం చడం, అప్పటి మంత్రి హరీశ్‌‌రావు ఆ పనిని తనకు అప్పగిం చడం అదృష్టం గా భావిస్తున్నానని తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ చైర్మన్‌‌ వెంకటేశం అన్నారు. ఆదిలాబాద్‌‌ జిల్లాలో ఐదు మధ్యతరహాఇరిగేషన్‌‌ ప్రాజెక్టులకు కేం ద్రం నుం చి క్లి యరెన్స్‌‌ తేవడంలో నా టి సీడబ్ల్యూసీ సీఈగా విద్యాసాగర్‌‌రావు కృషి మరువలేనిదని  సీఈ అంజద్‌‌ హుస్సేన్‌‌ అన్నారు. విద్యాసాగర్‌‌రావు కుమారుడు వెంకటరమణ, రిటైర్డ్‌‌ ఇంజనీర్ల అసోసియేషన్‌‌ అధ్యక్షుడు చంద్ర మౌళి, సీఈలు మధుసూదన్‌‌రావు, బి.వెంకటేశ్వర్లు , నర్సిం హ, వీరయ్య, సు రేశ్‌‌కుమార్‌‌, రమేశ్‌‌,హమీద్‌‌ఖాన్‌‌ తదితరులు పాల్గొన్నారు.

Latest Updates