ఫేక్​ మెసే​జ్​ పంపి 75 వేలు కొట్టేసిండు

  •                 రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ను ట్రాప్ చేసిన సైబర్ క్రిమినల్

ఏటీఎం నుంచి క్యాష్​ విత్ డ్రా అయినట్టు ఫేక్ మెసేజ్ పంపి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ నుంచి సైబర్ క్రిమినల్ రూ.75 వేలు కొట్టేశాడు. హిమాయత్​నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఉండే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మొబైల్​కి సోమవారం హఫీజ్​పేటలోని ఏటీఎం నుంచి క్యాష్​ విత్ డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. అది ఫేక్ అని తెలియక ఆయన అందులోని కస్టమర్ కేర్ నంబర్​కి కాల్ చేశాడు. తాను ఇంట్లోనే ఉన్నా, అకౌంట్​ నుంచి క్యాష్​ డ్రా అయిందని చెప్పాడు. డెబిట్ కార్డ్  సీరియల్, సీవీవీ, పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్తే ఏం జరిగిందో చూసి, చెప్తామని అవతలి వ్యక్తి తెలిపాడు. అలా డీటెయిల్స్​ తీసుకుని రూ.75 వేలు ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.

Latest Updates