బాలీవుడ్ లో చాన్స్ కోసం వెళ్లాడు…డ్రగ్స్ డీలరయ్యాడు

హైదరాబాద్ పాతబస్తీఅడ్డాగా సాగుతున్న డ్రగ్స్ దందా గుట్టు రట్టు చేశారుసౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. కామాటిపురపోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు సభ్యుల ముఠానుఅరెస్ట్ చేశారు. వారి నుంచి 28 గ్రాముల హెరాయిన్,5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముంబైనుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లయ్ చేస్తు్న్న ఈముఠా వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ శుక్రవారం వెల్లడించారు.

నిమాల్లో చాన్స్ కోసం…..

ఓల్డ్ సిటీ కామాటిపురకు చెందిన ఇశాక్ మొయిద్దీన్(23)కు సినిమాల్లో నటించాలనే కోరికతో 2015లోముంబై వెళ్లాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అవకాశాలు రాకపోవడంతో అక్కడే పబ్స్ లో నిర్వహించే స్టేజ్ షోలకు డీజే అసిస్టెంట్ గా పనిచేశాడు. ఈనేపథ్యం లో డ్రగ్స్ సప్లయర్లైన ఉస్మాన్ షేక్, సమద్రయిజ్ ఖాన్ తో ఇశాక్ కు పరిచయం ఏర్పడింది.వారితో కలిసి డ్రగ్స్ బానిసైన ఇశాక్ తాను కూడాడ్రగ్స్ సప్లయర్ గా మారాడు. డ్రగ్స్ దందాలో మంచిలాభం వస్తుండటంతో ముంబై నుంచి హైదరాబాద్ కు సప్లయ్ చేయడం ప్రారంభించాడు. ఒక గ్రాముహెరాయిన్ ను రూ.11వేలకు అమ్మే వాడు.

డ్రగ్స్ ఇచ్చి.. ఏజెంట్లుగా మార్చుకుని……

ఇశాక్ ఏడాదిగా పాతబస్తీలో డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నాడు. హెరాయిన్ ను ముంబై నుంచి బస్సులోతరలించేవాడు. తర్వాత పాతబస్తీలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఖాజా మొయిద్దీన్, సయ్యద్, వాజిద్,అభిషేక్, వహీద్, అమీర్ లకు అందించేవాడు. వీరికిడ్రగ్స్ అలవాటు చేసి తన ఏజెంట్లుగా మార్చుకున్నాడు. డ్రగ్స్ ను పాతబస్తీలోని యువతకు ఇంజె క్షన్లు,ఇన్ హెలేషన్, పాన్ మసాలాలో పెట్టి ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో ఉస్మాన్, ఇశాక్ ముఠా హెరాయిన్ సప్లయ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.

నిఘా వేసి…

గత నెల 29న ముంబై నుంచి ఇశాక్, సయ్యద్ డ్రగ్స్ తో హైదరాబాద్ వచ్చారని పోలీసులు గుర్తించారు. ఇన్ స్పెక్టర్ మధు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని టీమ్కామాటిపుర పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ పెడ్లర్ల కోసంగాలించింది. శుక్రవారం ఉదయం ఇశాక్, సయ్యద్లతో పాటు ఖాజా మొయిద్దీన్, వాజిద్, అభిషేక్లను అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి 28 గ్రాములహెరాయిన్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది.పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఉస్మాన్ షేక్ తోపాటు షేక్ వహీద్, అమీర్ అలీ కోసం గాలిస్తున్నారు. పాతబస్తీలో ఇలాంటి ముఠాలు ఇంకా ఉన్నాయా అనేవిషయాన్ని నిందితుల విచారణలో రాబడతామని అంజనీకుమార్ తెలిపారు. డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అభినందిచారు.

Latest Updates