SIని లాఠీతో కొట్టిన కానిస్టేబుల్

లాక్ డౌన్ తో పోలీసులు తీరిక లేకుండా పనిచేస్తున్నారు. గంటల తరబడి తనిఖీలు నిర్వహిస్తూ…ప్రజలను కంట్రోల్ చేస్తున్నారు. దీనికి తోడు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల మందలింపులతో కింది స్థాయి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు సహనం కోల్పోయి.. కోపం వ్యక్తం చేస్తున్నారు. అసహనంతో  ఓ కానిస్టేబుల్, ఎస్సైని లాఠీతో చితకొట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

సీతాపూర్ జిల్లా కొత్వాలీలో హెడ్‌ కానిస్టేబుల్  రామ్ సరాయ్‌ లాక్‌డౌన్‌ లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తూ కాసేపు సేదతీరేందుకు చైర్ లో కూర్చున్నాడు. అయితే అతడు తనిఖీలు సరిగ్గా చేయడం లేదని, చూసీ చూడనట్లు వదిలేస్తున్నావంటూ ఎస్ఐ రమేశ్… రామ్ సరాయ్ ని తిట్టడం మొదలు పెట్టాడు. అప్పటికే ఎండలో గంటల తరబడి పనిచేస్తున్న సరాయ్ కి కోపం వచ్చింది. దీంతో చేతిలో ఉన్న లాఠీతో ఎస్ఐపై దాడి చేశాడు. తోటి ఉద్యోగులు అతన్ని అడ్డుకున్నారు. ఈ విషయంపై విచారణ  చేపట్టిన జిల్లా ఎస్పీ ..హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.

Latest Updates