BSF హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.  మొత్తం 1074 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో పురుషులతో పాటు మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) పోస్టులు మూడు వందలు ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్)  విభాగంలో 772 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్ పాస్ అయి వుండాలి.
వయస్సు: 12.06.2019 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు 100 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు, డిపార్ట్ మెంటల్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయించారు.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు తేదీ: 14.05.2019 నుంచి 12.06.2019 వరకు.
స్క్రీనింగ్ టెస్ట్ 28.07.2019. ఫిజికల్ ఎగ్జామ్, డాక్యుమెంటేషన్ తేదీ.. 09.10.2019
డిస్క్రిప్టివ్ టెస్ట్ తేదీ: 24.11.2019. మెడికల్ టెస్ట్ తేదీ: 30.01.2020.

Latest Updates