డెలివరీ వీడియో వాట్పాప్ లో.. నర్స్ నిర్వాకం

head nurse-records-and-shares-delivery-video-on-whats-app-in-khammam

సోషల్ మీడియాలో ఏఏ పోస్టులు పెట్టాలో .. ఏవీ పెట్టకూడదో కనీస జ్ఞానం లేకుండా పోతోంది కొంతమందికి. తమ అరచేతిలోనే ప్రపంచముందనుకుంటూ తాము చేసిన ప్రతీ పనిని స్మార్ట్ ఫోన్ల ద్వారా పదిమందికి తెలియజేస్తున్నారు. మంచేదో, చెడోదో తెలిసిన చదువుకున్న వారే ఇలాంటి పనులు చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే..  పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ  డెలివరీ కోసం ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో  చేరింది.

ఆమెకు డెలీవరీ చేసిన సదరు హెడ్ నర్స్… ఆ సమయంలో వీడియో రికార్డు చేసింది. తర్వాత దాన్ని వాట్సాప్‌లో షేర్ చేసింది. వీడియో తీస్తున్న విషయం గానీ, దాన్ని వాట్సాప్‌లో పెట్టిన విషయం గానీ మత్తులో ఉన్న గర్భిణికి గ్రహించలేదు. ఆ డెలీవరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయి..  చివరకు ఆ మహిళ వరకు చేరింది. ఆ దృశ్యాలను చూసిన ఆమె ఒక్కసారగా నిర్ఘాంతపోయి, విషయాన్ని భర్తకు తెలిపి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆసుపత్రి సూపరింటెండ్‌ను ఈ వీడియో గురించి అడగగా.. ఆసుపత్రిలో వీడియో తీసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

 

Latest Updates