24 గంటలు.. ఆన్ డ్యూటీ.. రంగంలోకి హెల్త్ సోల్జర్స్

కరోనాపై డాక్టర్లు, నర్సులు, హెల్త్​ స్టాఫ్​ అలుపెరుగని యుద్ధం

రిస్క్​ అని తెలిసినా.. బాధితులతోనే ఉంటూ రాత్రనక, పగలనక సేవలు

వార్ అంటే మనకు సైన్యం గుర్తొస్తది. దేశం కోసం వాళ్లు చేసే త్యాగం యాదికొస్తది. మన కోసం రాత్రీపగలూ హద్దులు కాచే కష్టం వాళ్లది. ఇప్పుడు కరోనాపై రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచమంతా జరుగుతున్నది కూడా యుద్ధమే. అన్ని దేశాల బోర్డర్లను చెరిపేసిన ఈ యుద్ధంలో వైట్ యూనిఫాం సైనికుల్లా మారారు డాక్టర్లు.. నర్సులు.. దవాఖానల సిబ్బంది.. అంబులెన్సుల డ్రైవర్లు. తమకూ రిస్క్ ఉందని తెలిసినా వాళ్ల పోరాటం ఒక్క క్షణం కూడా ఆగలేదు. హెల్త్ సమస్యతో, అనుమానంతో, భయంతో రోజూ వస్తున్న జనానికి ఓపికగా టెస్టులు చేస్తున్నారు. అవసరమైనవాళ్లకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. వైరస్‌ను నిరోధించి తీరాల్సిన కీలకమైన దశలో జనానికి భరోసాగా నిలబడుతున్నారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోగలమన్న ధైర్యాన్నిస్తున్నారు. మన రాష్ట్రంతో పాటు దేశంలో, ప్రపంచమంతా కనిపించని శత్రువుపై 24 గంటలూ పోరాటం చేస్తోంది వీళ్లే.

హైదరాబాద్/పద్మారావునగర్, వెలుగు: కరోనా వైరస్‌‌‌‌ దునియాను గడగడలాడిస్తోంది. వైరస్ చైనాలో ఉన్నప్పుడే మనలో ఆందోళన మొదలైంది. ఇప్పుడు మన రాష్ట్రంలోకి ఎంటరైంది. ఇంట్లో ఉన్న వాళ్లు కూడా, వైరస్ మన వరకూ వస్తుందేమోనని భయపడుతున్నారు. కానీ డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ మాత్రం నిత్యం 8 నుంచి పది గంటలు కరోనా బాధితులతో గడుపుతున్నారు. కరోనా సోకకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు చెబుతూ వైరస్‌‌‌‌తో పోరాడుతున్నారు. తమ లైఫ్ రిస్క్ చేస్తూ, వైరస్ బాధితులకు సపర్యలు చేస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్నవాళ్లు వైరస్‌‌‌‌ను మోసుకొస్తున్నరని తెలిసినా.. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో వాళ్లకు అక్కడి స్టాఫ్​ సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌ పోర్టు మొదలు.. హాస్పిటళ్లలో  బాధితులకు ట్రీట్‌‌‌‌మెంట్ ఇవ్వడం వరకూ డాక్టర్లు, నర్సులు, హెల్త్ ఆఫీసర్లు, హెల్త్​ స్టాఫ్ కృషి చేస్తున్నారు.

వర్క్​ ఈజ్​ వర్షిప్‌​

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జలుబు చేసిన వ్యక్తి దగ్గరకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. గాంధీ హాస్పిటల్‌‌‌‌ డాక్టర్లు, నర్సులు మాత్రం వైరస్ సోకిన వ్యక్తులను ప్రతిరోజూ టచ్ చేస్తున్నారు. గాంధీ ఐసోలేషన్ వార్డుల్లో సుమారు 20 మంది డాక్టర్లు, 40 మంది నర్సులు, వైద్య సిబ్బంది పని చేస్తున్నారు.  హాస్పిటల్‌‌‌‌ గేట్‌‌‌‌ వద్ద వాచ్‌‌‌‌మన్‌‌‌‌ దగ్గర్నుంచి వార్డులో డాక్టర్ వరకూ రోజూ కనీసం 20 మంది వైరస్‌‌‌‌ అనుమానితులతో మాట్లాడుతున్నారు. ఏ ఒక్క సందర్భంలో చిన్న పొరపాటు జరిగినా వీళ్లకు వైరస్ వ్యాపించే ప్రమాదముంది. ఈ విషయం తెలిసినా కర్తవ్యాన్ని వాళ్లు మరవడంలేదు. వర్క్​ ఈజ్​ వర్షిప్‌​ అని ముందుకు సాగిపోతున్నారు. గాంధీ హాస్పిటల్​లోనే కాదు.. జిల్లాల్లోని హాస్పిటళ్లలోనూ హెల్త్​ స్టాఫ్​ వైరస్​పై యుద్ధం చేస్తున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో పని చేయడం తమకు గర్వంగా ఉందని డాక్టర్లు, నర్సులు, హెల్త్​ స్టాఫ్​ ఆనందంగా చెప్తున్నారు.  ‘‘నర్సులను ఏంజెల్స్‌‌‌‌ అంటరు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేస్తుంటే, అది నిజమే కదా అనిపిస్తోంది. చాలా గర్వంగా ఉంది’’ అని కరోనా పేషెంట్లకు సపర్యలు చేస్తున్న గాంధీ హాస్పిటల్​కు చెందిన ఓ నర్సు అన్నారు. ఇప్పుడు పని చేయకపోతే వృత్తికి ద్రోహం చేసినట్టేనని ఓ డాక్టర్‌‌‌‌‌‌‌‌ అభిప్రాయపడ్డారు. లోపల భయం వెంటాడుతున్నా గర్వంగా ఉందని ఓ వాచ్‌‌‌‌ మన్‌‌‌‌  అన్నారు.

వైరస్ విస్తరించకుండా ఓ టీమ్‌‌‌‌

వైరస్ బాధితులకు ట్రీట్‌‌‌‌మెంట్ ఇవ్వడం ఒక సవాలైతే, వైరస్ విస్తరించకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం కీలకమైన అంశం. ఇందుకోసం వెయ్యి మంది 24 గంటలు పనిచేస్తున్నారు. వైరస్ పాజిటివ్ అని తెలియగానే.. బాధితుడు ఎవరు, అతడిది ఏ ప్రాంతం, ఏ ఊరు, విదేశాలకు వెళ్లొచ్చాడా లేదా, ఎవరెవరిని కలిశాడు.. వంటి వివరాలన్నింటినీ గంటల్లోనే సేకరిస్తున్నారు. ఫోన్లు కలవకపోతే ఇంటికే వెళ్తున్నారు. వాళ్లలో ఎవరికైనా లక్షణాలుంటే నేరుగా దవాఖాన్లకు తరలిస్తున్నారు.  లేదంటే ఇంట్లోనే క్వారంటైన్ చేస్తున్నారు. క్వారంటైన్‌‌‌‌లో ఉన్నోళ్లకు రోజూ ఫోన్లు చేసి హెల్త్ కండీషన్‌‌‌‌ వాకబు చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌, డాక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతోంది. ఇలా కరోనాపై  ఇటు హెల్త్​ స్టాఫ్.. అటు అధికారులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు.

గాంధీ హాస్పిటల్​లో ఇలా..

విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌‌‌‌లో ఉన్నవాళ్లు సమాచారం అందించగానే, వాళ్ల ఇండ్లకు గాంధీ హాస్పిటల్​ నుంచి అంబులెన్స్‌‌‌‌లను పంపిస్తున్నారు.  అంబులెన్స్‌‌‌‌ సిబ్బంది పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌తో వెళ్లి, అనుమానితులకు ఎక్విప్‌‌‌‌మెంట్ తొడిగి గాంధీ హాస్పిటల్​కు తీసుకొస్తున్నారు. కొంత మంది తమ వాహనాల్లోనే నేరుగా ఈ హాస్పిటల్​కు  వస్తున్నారు. వీళ్లకు గేట్‌‌‌‌ దగ్గర వాచ్‌‌‌‌మెన్‌‌‌‌ మాట్లాడి, హెల్ప్‌‌‌‌ డెస్క్ వరకూ ఎలా వెళ్లాలో సమాచారం ఇస్తున్నారు. హెల్ప్‌‌‌‌ డెస్క్ దగ్గర ట్రావెల్ హిస్టరీ తదితర వివరాలు సేకరిస్తున్నారు. తర్వాత డాక్టర్లు పరీక్షించి లక్షణాలు లేని వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. లక్షణాలున్న వాళ్లను ఐసోలేషన్‌‌‌‌లో పెడుతున్నారు. వాళ్ల శాంపిల్స్‌ను టెస్టులకు పంపుతున్నరు

పాజిటివ్ వస్తే..

వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు గాంధీలో రోజూ రెండు నుంచి మూడు సార్లు నర్సులు బీపీ, టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ చెక్ చేస్తున్నారు. టెస్టులకు శాంపిల్స్ సేకరిస్తున్నారు. బాధితులు మానసికంగా కుంగిపోకుండా ధైర్యం చెబుతున్నారు. డాక్టర్లు రోజూ బాధితుడితో మాట్లాడి సింప్టమ్స్‌‌‌‌ను బట్టి ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్నారు. ఒక్కో పేషెంట్‌‌‌‌కు 10 నుంచి 20 మంది సేవలందిస్తున్నారు.  పేషెంట్, డాక్టర్లు, నర్సులు వాడిన మాస్కులు, వస్తువులను శుభ్రం చేస్తూ క్లాస్ 4 ఉద్యోగులు ఎంతో సేవ చేస్తున్నారు.

For More News..

కరోనా వల్ల పరీక్ష వాయిదా

ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు.. మొత్తంగా 13కు చేరిక

నేటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. అయిదు నిమిషాలు లేటైనా ఓకే..

కరోనా ఎఫెక్ట్: కరీంనగర్​లో మూడు కిలోమీటర్లు షట్​ డౌన్

కరోనాకు భయపడి కేసీఆర్ ఫాంహౌస్‌లో దాక్కున్నారు

Latest Updates