హెల్త్ పాలసీలపై అసంతృప్తి!

హెల్త్ ఇన్సూరె న్స్‌‌‌‌లపై దేశంలో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. ఇన్సూరెన్స్‌‌‌‌ ఫీచర్లు,బెనిఫిట్లు సరిగా లేవని పెదవి విరుస్తున్నారు. ఏజ్‌‌‌‌ పెరుగుతున్న కొద్దీ అసంతృప్తి స్థాయి కూడా పెరుగుతోంది. సెటిల్మెంట్‌‌‌‌ స్థాయి కొచ్చేసరికి మరీ ఎక్కువవుతోం ది. ఎకనమిక్‌‌‌‌ టైమ్స్‌‌‌‌ వెల్త్‌‌‌‌ ఇటీవల చేసిన సర్వేలోఈ విషయం వెల్లడైంది.

తక్కువకు తీసుకొని ఎక్కు వ అడుగుతున్నరు

హెల్త్ ఇన్సూరెన్స్‌‌‌‌ ఫీచర్లు, బెనిఫిట్లు సరిగా లేవని సుమారు 48 శాతం మంది పాలసీదారులు పెదవి విరుస్తున్నారని సర్వేలో తేలింది. 65 ఏళ్ల పై బడినవాళ్లలో పాలసీలపై అసంతృప్తి చాలా ఎక్కువగా ఉందని, 67 శాతం మంది అసహనం వెళ్లగక్కుతున్నారని వెల్లడైంది. సెటిల్మెంట్లలోనూ 60–64ఏళ్లలో 70 శాతం మంది అసంతృప్తి చెం దుతున్నారని తెలిసింది. ఏజెంట్‌‌‌‌ మాటలు నమ్మి పాలసీలు తీసుకున్న వారిలో 61 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారని సర్వే చెప్పింది. కంపెనీపై నమ్మకంతో తీసుకున్నవారిలో 57 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారంది.తక్కువ ప్రీమియంకు పాలసీ తీసుకొని ఎక్కువ ఆశపడ్డవారూ ఉన్నారని, ఇలా 57 శాతం మంది పాలసీ పైవిమర్శలు చేశారని వివరించింది.

రెన్యు వల్‌‌‌‌ ప్రీమియం తలనొప్పి

పాలసీ రెన్యువల్‌‌‌‌ ప్రీమియం అమాంతం పెంచుతుండటం కూడా పాలసీదారులను ఇబ్బంది పెడుతోంది.కంపెనీలేమో ద్రవ్యోల్బణం, ఇతర సర్వీసులను బట్టిప్రీమియం పెరుగుతుంటాయని చెబుతున్నాయి.దేశంలో  రోజురోజుకు పెరుగుతున్న వైద్య ఖర్చులూ దీన్ని ప్రభావితం చేస్తాయంటున్నాయి. కానీ,పాలసీతో లాభమొస్తుందనుకున్నపుడు  ప్రీమియం తీసుకుంటు న్నారని, నష్టమనుకుంటే  ప్రీమియం అమాంతం పెంచి కట్టకుం డా చేస్తున్నారని కన్జ్యూమర్ యాక్టివిస్టులు విమర్శిస్తున్నారు. మరోవైపు ఇన్సూరర్‌‌‌‌ కంపెనీలు పాలసీదారు గత క్లెయిమ్స్‌‌‌‌ ఆధారంగా ప్రీమియంను పెంచుకునే వెసులు బాటు ఐఆర్‌‌‌‌డీఏఐ కల్పించింది. రెన్యు వల్‌‌‌‌ ప్రీమియంలు వయసును బట్టిపెరుగుతూనే ఉంటాయని నిపుణులంటున్నారు. పాలసీదారుకు 36 ఏళ్లొస్తే 30-–35 ఏళ్ల గ్రూప్‌‌‌‌ నుంచి36-–40 ఏళ్ల గ్రూప్‌‌‌‌లోకి వెళ్తారని, ప్రీమియం కూడా పెరుగుతుందని వివరిస్తున్నారు.

చదివి పెట్టండి సంతకాలు

పాలసీని మొత్తం చదవకుండా ఎక్కడపడితే అక్కడ సంతకాలు చేస్తే మున్ముందు చాలా సమస్యలొస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆదరబాదరాగాపాలసీలు తీసుకోవద్దని, అలా చేస్తే పాలసీదారులకుటుం బాలే ఎక్కువగా ఇబ్బంది పడతాయని వివరిస్తున్నారు. కాబట్టి సంతకాలు కేవలం ఫార్మాలి టీలే అనుకోవద్దని చెబుతున్నారు. ‘పాలసీ కంపెనీలు,ఏజెంటు పాలసీల గురించి వివరాలు చెప్పినా పాలసీ తీసుకునే వారికి ప్రత్యేకంగా ఓ కిట్‌‌‌‌ ఇస్తారు. అందులోపూర్తి వివరాలు, టర్మ్స్‌‌‌‌ అండ్‌‌‌‌ కండీషన్స్‌‌‌‌ ఉంటాయి’అని సిగ్నా టీటీకే హెల్త్‌‌‌‌ ఇన్సూరె న్స్‌‌‌‌ కంపెనీ సీఈవోవెల్లడిం చారు. క్లెయిమ్‌‌‌‌లపైనా పాలసీదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 60 శాతం మంది ఈలిస్టులో ఉన్నారు. ఏవేవో ఎక్స్‌‌‌‌క్లూ జన్స్‌‌‌‌ చెప్పి తక్కువ డబ్బు చెల్లిస్తున్నారని 65 శాతం మంది అసహనంవ్యక్తం చేశారు. క్లెయిమ్స్‌‌‌‌ ఆలస్యమవుతున్నాయని 42శాతం మంది అన్నారు. కానీ 65 ఏళ్ల పైబడిన వారిలోమాత్రం క్లెయిమ్స్‌‌‌‌పై అసంతృప్త స్థాయి తక్కువుం ది.పాలసీదారులు ఒక్కోసారి అనారోగ్యం వివరాలు దాచేస్తుంటా రని, అలాంటప్పుడు క్లెయిమ్స్‌‌‌‌ను తిరస్కరిస్తారని నిపుణులు అంటున్నారు. కాబట్టి ముందే చెప్పడం మేలని సూచిస్తున్నారు.

Latest Updates