కరోనా బాధితులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌

  •                 ట్రావెల్ హిస్టరీ లేకుంటే
  •                 పాలసీ ఇస్తాం: స్టార్‌హెల్త్‌

కరోనా పాజిటివ్‌గా తేలి, ట్రీట్‌మెంట్‌ అవసరమైన వారి కోసం ప్రత్యేక హెల్త్‌ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకొచ్చినట్టు స్టార్‌హెల్త్‌ అండ్‌ అల్లాయిడ్ ఇన్సూరెన్స్‌ శుక్రవారం ప్రకటించింది. ‘స్టార్‌ నావెల్‌ కరోనా వైరస్‌’గా పిలిచే ఈ పాలసీకి 18–65 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు అర్హులు. బాధితులకు కరోనా సోకిందని, చికిత్స అవసరమని ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థ నిర్ధారిస్తే వైద్యఖర్చులకు డబ్బు చెల్లిస్తారు. అయితే విదేశాలకు వెళ్లివచ్చిన వారికి ఈ పాలసీ వర్తించదు. రూ. 21 వేల సమ్‌ ఎష్యూర్డ్‌ పాలసీకి రూ. 459,  రూ.42 వేల సమ్‌ ఎష్యూర్డ్‌ పాలసీకి రూ. 918 ప్రీమియంగా ( జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆన్‌లైన్‌లో లేదా కంపెనీ ఏజెంట్ల ద్వారా పాలసీని కొనుక్కోవచ్చు.   ప్రస్తుతం ఉన్న తమ రెగ్యులర్‌ పాలసీలన్నింటిలోనూ కరోనా ట్రీట్‌మెంట్‌కు కవరేజీ ఉంటుందని కంపెనీ తెలిపింది.

Latest Updates