‘హెల్త్’ కు ప్రతి నెల పైసలియ్యాలె: హరిశ్‌‌రావుకు ఈటల‌‌ విజ్ఞప్తి

ఆరోగ్య శాఖకు ప్రతి నెల నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌రావును హెల్త్‌‌ మినిస్టర్‌‌‌‌ ఈటల రాజేందర్ కోరారు. మంగళవారం రెండు శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు ఎంసీఆర్‌‌ ‌‌హెచ్‌‌ఆర్డీలో భేటీ అయ్యారు. హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు బడ్జెట్‌‌ కేటాయింపులు, పెండింగ్‌‌ బిల్లులు, నిధుల విడుదలపై సమీక్షించారు. కాంట్రాక్ట్‌‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సకాలంలో నిధులు విడుదల కావడంలేదు. ఒక్కోసారి నాలుగైదు నెలల వరకూ జీతాలు పెండింగ్ పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో సకాలంలో జీతాలు చెల్లించేలా నిధులు విడుదల చేయాలని ఈటల కోరారు. హెల్త్‌‌కు కేటాయించిన నిధుల్లో నుంచి నెలకు రూ.150 కోట్లు విడుదల చేసి మెడిసిన్ కొనుగోలు, కేసీఆర్‌‌‌‌ కిట్ పథకాలకు ఆటంకం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. జీతాల చెల్లింపునకు ఆటంకం లేకుండా నిధులు విడుదల చేస్తామని, వేతనాల బిల్లులను సకాలంలో పంపించాలని హెల్త్‌‌ ఆఫీసర్లకు హరీశ్‌‌రావు సూచించారు. ఎన్‌‌హెచ్‌‌ఎం నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యాన్ని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌‌హెచ్‌‌ఎం కార్యక్రమాలకు రాష్ర్ట వాటా సకాలంలో విడుదల చేస్తే.. కేంద్రంతో మరిన్ని నిధులు సాధించుకోవచ్చన్నారు.

Latest Updates