లవ్ అగర్వాల్‌కి కరోనా పాజిటివ్

త‌న‌కు క‌రోనా వైర‌స్ సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ట్వీట్ చేశారు. మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం హోం ఐసోలేష‌న్ లో ఉన్న‌ట్లు తెలిపారు.
మ‌రోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్షవ‌ర్ధ‌న్ మాట్లాడుతూ క‌రోనా అంశాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు తెలిపారు. ఈ వారంలో రష్యా ప్రకటించిన కరోనావైరస్ వ్యాక్సిన్ పై కేంద్రం సహేతుకమైన నిర్ణయం తీసుకుంటుందని వెల్ల‌డించారు. వ్యాక్సిన్ విష‌యంలో ప్ర‌తీ అంశాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలుస్తున్నామ‌న్న ఆయ‌న‌.. ర‌ష్యా విడుద‌ల చేసిన క‌రోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న 20 దేశాలలో భారత్ కూడా ఉందని రష్యా ఇంతకుముందు తెలిపిన విష‌యం తెలిసిందే.

Latest Updates